బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 11, 2020 , 15:48:19

పులి బొమ్మతో జంతువులను భయపెడుతున్న యూట్యూబర్‌

పులి బొమ్మతో జంతువులను భయపెడుతున్న యూట్యూబర్‌

బ్యాంకాక్: థాయిలాండ్‌కు చెందిన ఒక యూట్యూబర్‌ పులి బొమ్మతో జంతువులను భయపెడుతున్నారు. కోతి, కుక్క, పిల్లి వంటి వాటి ముందు పులి బొమ్మను ఉంచుతున్నాడు. ఈ నకిలీ పులిని చూసి నిజమైన పులిగా భ్రమపడి ఆ జంతువులు  భయంతో స్పందిస్తున్న తీరును చిత్రీకరిస్తున్నాడు. ఈ వీడియోలను తన యూట్యూబ్‌ చానల్‌ ‘ఏంజ‌ల్‌ నాగ’లో పోస్టు చేస్తున్నాడు. ఈ వీడియోల ద్వారా వచ్చే ఆదాయంతో వీటికి ఆహారం పెడుతున్నట్లు అతడు పేర్కొన్నాడు. 


మరోవైపు జంతువులను భయపెట్టే అతడి ఫ్రాంక్‌  వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వీటిని సుమారు 40 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలపై నెటిజన్లు భిన్నంగా కామెంట్‌ చేశారు. వీడియోలు వండర్‌ఫుల్‌గా ఉన్నాయని కొందరు ప్రశంసించారు. కాగా, కుక్క, పిల్లి వంటి జంతువులు పులిని చూసి ఉండవని, అలా భయపడం ఎలా సాధ్యమని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. అలా నటించాలని వాటికి అతడు ట్రైనింగ్‌ ఇచ్చి ఉంటాడని మరి కొందరు కామెంట్‌ చేశారు. అయితే వాటికి ఆహారం కోసం అతడు చేస్తున్న కృషిని కొనియాడారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.