సోమవారం 08 మార్చి 2021
International - Jan 23, 2021 , 11:26:36

వైర‌స్‌పై త‌ప్పుడు క‌థ‌నాలు.. యూట్యూబ్ ఛానెల్‌పై నిషేధం

వైర‌స్‌పై త‌ప్పుడు క‌థ‌నాలు.. యూట్యూబ్ ఛానెల్‌పై నిషేధం

హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్‌పై త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్‌పై గూగుల్‌‌ నిషేధం విధించింది. జ‌ర్మ‌నీకి చెందిన కెన్ ఎఫ్ఎం అనే యూట్యూబ్ ఛానెల్ ఇటీవ‌లే వైర‌స్ వ్యాప్తిపై త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది. నాడే గూగుల్ ఆ ఛానెల్‌కు స్ర్ట‌యిక్ విధించింది. అయిన‌ప్ప‌టికీ ఆ ఛానెల్ య‌జ‌మాని కెన్ జెబ్‌సేన్‌లో ఎలాంటి మార్పు రాలేదు. అలా వ‌రుస‌గా మ‌రో రెండుసార్లు త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేశాడు. మూడు స్ర్ట‌యిక్ విధించిన అనంత‌రం ఆ ఛానెల్‌ను యూట్యూబ్ నుంచి గూగుల్ తొల‌గించింది. భ‌విష్యత్‌లో అత‌నికి ఛానెల్ న‌డిపేందుకు అనుమ‌తివ్వ‌మ‌ని గూగుల్ స్ప‌ష్టం చేసింది. యూట్యూబ్ గైడెలైన్స్‌ను ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని ఎన్నిసార్లు చెప్పినా, ఆ ఛానెల్ సిబ్బంది వినిపించుకోలేద‌ని, త‌మ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన నేప‌థ్యంలోనే నిషేధం విధించామ‌ని గూగుల్ పేర్కొంది. 

VIDEOS

logo