బుధవారం 28 అక్టోబర్ 2020
International - Oct 12, 2020 , 19:03:11

స్కూట‌ర్ల మీద ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్స్ చేస్తున్న యువ‌కులు.. గాలిస్తున్న పోలీసులు

స్కూట‌ర్ల మీద ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్స్ చేస్తున్న యువ‌కులు.. గాలిస్తున్న పోలీసులు

యువ‌కుల చేతికి బైక్ కీస్ ఇస్తే ఇంకేమైనా ఉంటుందా? ర‌య్ ర‌య్ మంటూ ఆగ‌మేఘాల మీద దూసుకెళ్తారు. వీళ్లు కూడా అంతే రెండు బైకుల మీద న‌లుగురు యువ‌కులు కూర్చొని ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్స్ చేస్తూ రోడ్డు మీద చ‌క్క‌ర్లు కొడుతున్నారు. వీరు చేసే అల్ల‌రి ఎవ‌రికీ తెలియ‌దు అనుకున్నారు. కానీ సీసీకెమెరాలు బ‌ట్ట‌బ‌య‌లు చేశాయి. గేర్లు లేని స్కూట‌ర్ల‌తో బెంగ‌ళూరు రోడ్ల‌పై చ‌క్క‌ర్లు కొడుతున్న వీరి వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇది కాస్త పోలీసుల కంట ప‌డింది. స్కూట‌ర్ నెంబ‌ర్ల ఆధారంగా వీరిని కేఆర్‌పురం పోలీస్ స్టేష‌న్ అధికారులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు.

 


logo