బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 02, 2020 , 11:26:01

కెరీర్‌ ర్యాప్‌తో ఆకట్టుకుంటున్న ఆరేళ్ల బాలుడు..!

కెరీర్‌ ర్యాప్‌తో ఆకట్టుకుంటున్న ఆరేళ్ల బాలుడు..!

న్యూయార్క్‌: భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారో పిల్లలకు చిన్ననాటినుంచే స్పష్టత ఉండాలి. అప్పుడే వాళ్లు అందుకనుగుణంగా కష్టపడడం ప్రారంభిస్తారు. అలాంటివారికోసం ఓ ఆకట్టుకునే ర్యాప్‌తో ముందుకొచ్చాడు ఓ ఆరేళ్ల బాలుడు. ఏ ఫర్‌ ఆర్కిటెక్చర్‌, బీ ఫర్‌ బయోకెమిస్ట్‌ అంటూ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్నాడు. 

రాబర్ట్ శామ్యూల్ అనే బాలుడు కెరీర్‌పై అద్భుతమైన ర్యాప్‌ పాడాడు. ఆ వయస్సు పిల్లలు ఏ ఫర్‌ ఆపిల్‌.. బీ ఫర్‌ బాల్‌ అంటూ పాడుతుంటే ఇతడు ఏకంగా కెరీర్‌పైనే దృష్టిపెట్టాడు. అతడి తండ్రి బాబీవైట్‌ అతడికి సహాయం చేశాడు. రాబర్ట్‌ శామ్యూల్‌ భవిష్యత్తులో ఆర్కిటెక్ట్‌ అవ్వాలని కోరుకుంటున్నాడట. అలాగే, గవర్నర్ లేదా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిని అవ్వాలని కూడా ఆశిస్తున్నాడట ఈ బుడతడు. ఇన్‌స్టాలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. ఆ బాలుడిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.