బుధవారం 03 జూన్ 2020
International - Apr 07, 2020 , 10:52:18

‘మీరు మాకు గర్వకారణం, మాకు స్ఫూర్తిప్రదాతలు’

‘మీరు మాకు గర్వకారణం, మాకు స్ఫూర్తిప్రదాతలు’

హైదరాబాద్‌: కరోనావైరస్‌ పోరాడుతున్న నర్సులు, ఆరోగ్యకార్యకర్తలు మనందరినీ గర్వపడేలా చేశారని, అందరికీ ఆదర్శంగా నిలిచారని ఐకరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ అన్నారు. ఈ ఏడాదిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులు, మిడ్‌వైవ్స్‌కు అంకితమిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన వీడియోను ట్వీట్‌ చేశారు. అత్యంత క్లిష్ట సమయంలో వరల్డ్‌ హెల్త్‌ డే జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. ‘కరోనా మహమ్మారిపై పోరాడుతున్న మా ఆరోగ్యకార్యకర్తలకు మేం కృతజ్ఞులం. ‘మీరు మాకు గర్వకారణం, మాకు స్ఫూర్తినిస్తారు, మేం మీతో నిలబడతాం, మిమ్మల్ని నమ్ముతాం’ అని పేర్కొన్నారు. ‘సపోర్ట్‌ నర్సెస్‌, మిడ్‌వైవ్స్‌'ని ఈ ఏడాది ప్రధాన ఇతివృత్తంగా ప్రకటిస్తున్నామని అన్నారు.


logo