మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 15:30:47

ఈ నంబర్‌లో నాకు మెసేజ్‌ పంపండి : ఒబామా

ఈ నంబర్‌లో నాకు మెసేజ్‌ పంపండి : ఒబామా

చికాగో : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడిన వేళ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రంగంలోకి దిగారు. డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఒబామా అమెరికా 44 వ అధ్యక్షుడిగా ఎన్నికై తన పాలనాసమయంలో లక్షల సంఖ్యలో అభిమానులను కూడగట్టుకున్నారు. తన మంచితనంతో వేనోళ్లా పొగడ్తలు అందుకున్న ఒబామా.. ఈసారి తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సాధారణ పౌరులతో మాట్లాడేందుకు తన ఫోన్‌ నంబర్‌ ఇచ్చి మెసేజ్‌ పంపండి అంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాల్లో విజ్ఞప్తిచేశారు. 

కొన్నిరోజుల క్రితం గ్రాడ్యుయేట్ల సమావేశంలో ప్రసంగించి అభిమానులను అలరించిన బరాక్‌ ఒబామా.. ఇప్పుడు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వేదికగా కలుసుకోవడం  పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారో.. వారి మనసులో ఏమున్నదో.. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలని ఆలోచిస్తున్నారో.. తెలుసుకోవాలనుకుంటున్నానని తన మెసేజ్‌లో చెప్పారు. “క్రొత్తదాన్ని ప్రయత్నిద్దాం. మీరు యునైటెడ్ స్టేట్స్లో ఉంటే.. నాకు 773-365-9687 వద్ద ఒక మెసేజ్‌ను పంపండి. మీరు ఏం చేస్తున్నారో.. మీ మనసులో ఏముందో.. ఈసారి ఓటు వేయడానికి ఎలా ప్రణాళిక వేస్తున్నారో నేను వినాలనుకుంటున్నాను. నా మనసులో ఉన్నదాన్ని పంచుకోవడానికి నేను ఎప్పటికప్పుడు సన్నిహితంగా ఉంటాను” అని ఒబామా ట్వీట్ చేశారు. ఒబామా ప్రజలకు ఇచ్చిన ఫోన్‌ నంబర్‌లో ఏరియా కోడ్‌ 773 చికాగోకు చెందినది. కాగా, బరాక్‌ ఒబామా తన ఫోన్‌ నంబర్‌ను అభిమానులతో పంచుకోవడం పట్ల  పలువురు ఆశ్చర్యానికి గురవగా.. మరికొందరు మనల్నిఆటపట్టిస్తున్నారని కొట్టిపారేశారు. అభిమానులేమో మరోసారి అమెరికా అధ్యక్షుడిగా మిమ్మల్ని చూడాలని ఉందంటూ మెసేజ్‌లు పెడుతున్నారు.

త్వరలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా జో బిడెన్‌, ఉపాధ్య అభ్యర్థిగా కమలా హారిస్‌ రంగంలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలలో పేరు నమోదు చేసుకోవడానికి, ఓటు వేయడానికి ప్రజలను ప్రోత్సహించడంలో సహాయపడటానికి ఒబామా చేసిన ప్రయత్నంగా టెక్స్ట్ మెసేజ్ చొరవగా కనిపిస్తున్నది.logo