ఆదివారం 31 మే 2020
International - May 13, 2020 , 18:50:44

వృద్దాప్యఛాయలు ఎవరికి, ఎప్పడొస్తాయో తెలుసా?

వృద్దాప్యఛాయలు ఎవరికి, ఎప్పడొస్తాయో తెలుసా?

ఈ జెన‌రేష‌న్‌లో  చిన్న‌వ‌య‌సులోనే వృద్దాప్యఛాయలు క‌నిపిస్తున్నాయి. దానికి కార‌ణం వారు తీసుకునే తిండి, జీన్స్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కొంమంది వ‌య‌సు పెరుగుతున్నా చిన్న‌పిల్ల‌ల్లా క‌నిపిస్తారు. అది వారి అదృష్టం అని అనుకుంటారు. ఎలాంటి వారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయన్న విషయంపై అధ్యయనం చేసిన ఓ అంతర్జాతీయ పరిశోధకుల బృందం తాజాగా వాటి ఫలితాలను వెల్లడించింది. 40 ఏండ్లు దాటిన వారు ఎంత వేగంగా నడుస్తున్నారో, దాన్నిబట్టి వారిలో వృద్ధాప్య ఛాయలు ఏ మేరకు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించవచ్చని తెలిపింది. అలాగే, వాటిని ఎలా గుర్తించవచ్చో వెల్లడించింది. 

- సాధారణంగా 45 ఏళ్ల వయసులో ఉన్న వారు నిదానంగా నడుస్తున్నట్లయితే వారిలో త్వరగా వృద్ధాప్యం వచ్చిందని తెలుసుకోవచ్చు. 

-  ఈ వృద్ధాప్య తాలూకు సంకేతాలు శ‌రీరంలోనే కాకుండా ముఖంలోనూ కనపడతాయి. వీరి మెదడు పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. 

- కండరాల ఆరోగ్యం, ఊపిరితిత్తుల పనితీరు, శరీర బ్యాలెన్స్‌, వెన్నెముక శక్తి, కంటి చూపు వంటి విషయాలను గుర్తించడానికి వారి నడక ఓ సూచికగా ఉపయోగపడుతుంది.

- మెల్లగా నడిచే అలవాటు ఉన్న వృద్ధులు చిత్తవైకల్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది.  

- న్యూజిలాండ్‌లో 1970 కాలంలో జన్మించిన 1000 మందిపై పరిశోధనలు జరిపి ఈ విషయాలను గుర్తించారు. వారి శారీరక ఆరోగ్యాన్ని తెలిపే పరీక్షలతో పాటు మెదడు పనితీరును తెలిపే పరీక్షలను అధ్యయనం చేశారు. 

- 45 ఏళ్ల వయసులో ఉన్నవారు సెకనుకు 2మీటర్లు నడుస్తున్నారని, ఈ వయసు వారు నడిచిన వేగంలో ఇదే అత్యధికమని గుర్తించారు. 

- వేగంగా నడుస్తున్న వారి కంటే మెల్లగా నడుస్తున్న వారిలో వృద్ధాప్య ఛాయల తాలూకు సంకేతాలు అధికంగా ఉన్నాయని తేల్చారు. వారి ఊపిరితిత్తులు, రోగ నిరోధక శక్తి వ్యవస్థలు బాగోలేవని గుర్తించారు. 

- ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు ఆహార అలవాట్లు ఇందుకు కారణమని చెప్పారు. 


logo