గురువారం 28 మే 2020
International - Apr 03, 2020 , 18:55:48

కంట‌త‌డి పెట్టిస్తున్న అక్కాచెల్లెళ్లు.. వీడియో

కంట‌త‌డి పెట్టిస్తున్న అక్కాచెల్లెళ్లు.. వీడియో

ఇంట‌ర్కెట్‌లో రోజుకి ఎన్నో వీడియోలు చూస్తుంటాం. ఇది మాత్రం ప్ర‌తిఒక్క‌రినీ కంటతడి పెట్టిస్తుంది. అమెరికాకు చెందిన గ్యాబీ క్యాన్స‌ర్ బారిన ప‌డింది. ట్రీట్‌మెంట్ కోసం గ్యాబీకి త‌ల‌మీద జుట్టు, క‌నుబొమ్మ‌ల‌ను తొల‌గించారు.  వ్యాధి సోకిన దానికంటే అంద‌వికారంగా ఉంద‌నే బావ‌నే ఆమెను ఎక్కువ‌గా క‌లిచివేస్తున్న‌ది. దీనిని పోగొట్టేందుకు గ్యాబీ అక్క‌య్య క్యామి త‌న జుట్టు, క‌నుబొమ్మ‌లు తీసేస్తూ ఓ మాట చెప్పింది. ఆ మాట‌లు అందిరి గుండెలను బరువెక్కిస్తున్నాయి.  'నువ్వంటే(చెల్లెలు) నాకు ఎప్ప‌టికీ ఇష్టం. ఎలా ఉన్నా నువ్వు అందంగా ఉంటావు. ఎదుటివాళ్ల‌కు ఉండి నీకు లేక‌పోవ‌డం వ‌ల్లే క‌దా నువ్వు బాధ‌ప‌డుతున్నావు. ఇదిగో నేను కూడా ఇప్పుడు నీలానే ఉన్నా. జుట్టు లేక‌పోవ‌డం వ‌ల్ల నీ అందం ఏం త‌గ్గ‌లేదు. ఇందుకు నిద‌ర్శ‌నం నేనే. ఇదంతా  ఎవ‌రికోస‌మే చేయ‌ట్లేదు. నా ల‌వ్లీ సిస్ట‌ర్ కోస‌మే అంటూ చెల్లిని ఓదార్పునిస్తూ' ధైర్యం చెబుతుంది. ఆ త‌ర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రూ ఏడుస్తూ ఒక‌రిని ఒక‌రు కౌగిలించుకున్నారు. ఈ వీడియోను క్యామీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సింగ‌ర్స్‌ రిహానా, జ‌న‌త్ జాక్స‌న్ సెల‌బ్రిటీలను సైతం కంట‌త‌డి పెట్టించింది. గ్యాబీ తొంద‌ర‌గా కోలుకోవాలి. మీరిద్ద‌రూ ఆనందంగా ఉండాల‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.logo