శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 10, 2020 , 20:41:32

రోగి కోలుకుంటే.. డాక్ట‌ర్లు డ్యాన్స్ చేస్తారు : వీడియో

రోగి కోలుకుంటే.. డాక్ట‌ర్లు డ్యాన్స్ చేస్తారు : వీడియో

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో రోనాల్డ్ రీగన్ యుసిఎల్‌ఎ మెడికల్ సెంటర్ ఐసియు బృందం క‌రోనా సోకిన వారికి వైద్యం అందిస్తున్న‌ది. కొవిడ్‌-19 నుంచి రోగులు పూర్తిగా కోలుకున్న త‌ర్వాత వెంటిలేట‌ర్ తొలగించి డాక్ట‌ర్లు కాసేపు ఎక్స్‌బుబేష‌న్ డ్యాన్స్ చేస్తున్నారు. డాక్ట‌ర్ నిడా ఖాదిర్ ఈ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 'ఇంత‌మంది బాధ‌ల్లో ఉంటే ఆనందంగా డ్యాన్స్ ఎలా చేస్తున్నారు కొంచెం కూడా విచారం లేదా అని కొంద‌రు అనొచ్చు. కానీ, మేము దీన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుంటున్నాము. ఈ డ్యాన్స్‌తో మాకు మ‌రింత ఉత్సాహం వ‌స్తుంది అని డ్యాక్ట‌ర్ అంటున్నారు. రోగులు త్వ‌ర‌గా కోలుకోవాలి, మేము డ్యాన్స్ చేయాలి అనే క్యాప్ష‌న్‌తో వీడియో పోస్ట్ చేశారు. 

ఈ వీడియో 7.24 లక్షలకు పైగా వీక్షించారు. 30,000 మంది లైక్ చేశారు. ఇది ప్రజలను ఉత్సాహపరిచింది అంతేకాదు, వారిలో ఆశ‌లు నింపుతున్న‌ది. 'అమెరిక‌న్ ప్ర‌జ‌ల‌కోసం చేస్తున్న సేవ‌కు మీ బృందానికి ధ‌న్య‌వాదాలు'. 'మీరు నిజ‌మైన హీరోలు'. 'గొప్ప ప‌నిని కొన‌సాగించండి - నేను మ‌రో ఎక్స్‌బుబేష‌న్ డ్యాన్స్ కోసం ఎదురుచూస్తుంటాను' అని కామెంట్లు పెడుతున్నారు.logo