మంగళవారం 02 మార్చి 2021
International - Jan 15, 2021 , 18:53:35

మిలిటరీతో లింక్స్‌:జియోమీపై ట్రంప్‌ నిషేధం!

మిలిటరీతో లింక్స్‌:జియోమీపై ట్రంప్‌ నిషేధం!

వాషింగ్టన్‌: అధ్యక్షుడిగా చివరి ఐదు రోజుల్లోనూ డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనాపై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ జియోమీ, చైనాలో మూడో జాతీయ చమురు సంస్థ, కమర్షియల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఆఫ్‌ చైనా (కొమాక్‌) సంస్థలకు చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్నాయన్న సాకుతో వాటిని బ్లాక్‌ లిస్టులో పెడుతూ ట్రంప్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

మరో అయిదు చైనా సంస్థలను బ్లాక్‌ లిస్టులో పెట్టారు. ఇంతకుముందు నవంబర్‌లో ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ ఎనిమిది చైనా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన అమెరికన్లు నవంబర్‌లోగా వాటిని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. అమెరికా ఆరోపణలపై జియోమీ ట్విట్టర్‌ వేదికగా వివరణ ఇచ్చింది.

తమ సంస్థ చైనా మిలిటరీ యాజమాన్యంలో, నియంత్రణలో, అనుబంధంగా గానీ పని చేయడం లేదని జియోమీ ట్వీట్‌ చేసింది. అమెరికా నిషేధంపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. 

ఇదిలా ఉంటే, జియోమీ కంటే ముందు చైనా స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ హువావేపైనా నిషేధాజ్ఞలు విధించింది. అయినప్పటికీ 2020లోని మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ ఫోన్ల విక్రయాల్లో టెక్‌ దిగ్గజం ఆపిల్‌ను దాటేసి మూడో స్థానాన్ని జియోమీ సొంతం చేసుకున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo