మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 17:53:12

అనుకోని అపజయం మూటగట్టుకున్న జిన్‌పింగ్‌

అనుకోని అపజయం మూటగట్టుకున్న జిన్‌పింగ్‌

వాషింగ్టన్ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తన దూకుడు చర్యల ద్వారా అనుకోని అపజయాలను మూటగట్టుకున్నారు. భారత సైన్యంతో పీఎల్ఏ ఘర్షణకు దిగడం ద్వారా దూకుడును పెంచిన జిన్‌పింగ్‌.. సరిహద్దులోని భూభాగంలోకి చొరబడటంతో తన భవిష్యత్తును పణంగా పెట్టారని అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ న్యూస్ వీక్ తన కథనంలో వెల్లడించింది.  

భారత్ తో ఇటీవల ఘర్షణకు దిగటం ద్వారా జిన్‌పింగ్‌ తనకు తానుగా నాశనాన్ని కొనితెచ్చుకున్నాడని ఆ కథనంలో పేర్కొన్నది.

భారత్ తో సరిహద్దులో ఘర్షణకు పథక రచన స్వయంగా జిన్‌పింగ్‌ చేశారని, అయితే భారత దళాలు పీఎల్ఏను తిప్పికొట్టడంతో తీవ్ర భంగపాటుకు గురయ్యారు. ఇప్పటికే చైనా ప్రజలతోపాటు పాలక కమ్యూనిస్టు పార్టీలో జిన్‌పింగ్‌ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. చైనా ప్రజలు, తన పార్టీ నాయకుల ద్రుష్టిని మరల్చేందుకుగాను జిన్‌పింగ్‌.. భారత సరిహద్దులో ఘర్షణ వాతావరణానికి ప్లాన్ చేశారని, అయితే భారత సైన్యం గట్టిపోటీ ఇవ్వడంతో అనుకోని అపజయాన్ని మూటగట్టుకున్నారని, ఇది మూమ్మాటికి జిన్‌పింగ్‌ శరాఘాతమే అని న్యూస్ వీక్ తన కథనంలో పేర్కొన్నది. 

వరుస వైఫల్యాల నుంచి బయటపడేందుకు దిద్దుబాటు చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తున్నది. అయితే, అది దిద్దుబాటులా కాకుండా భారత్ పట్ల మరోసారి మరింత దూకుడుగా, క్రూరంగా వ్యవహరించే అవకాశాలున్నాయని న్యూస్ వీక్ అభిప్రాయపడింది. భారత సైన్యంతో ఘర్షణకు దిగి వెనకడుగు వేసిన పీఎల్ఏ వైఫల్యాలు తప్పనిసరిగా పరిణామాలను కలిగివుంటాయని, ఇటీవలి పరిణామాలు సాయుధ దళాల్లో విరోధుల స్థానంలో విశ్వసనీయులతో భర్తీ చేసేందుకు జిన్‌పింగ్‌కు సాకు లభించినట్లయిందని తన కథనంలో వెల్లడించింది.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ), పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకుడిగా ఉన్న జిన్‌పింగ్‌ను ఆయన వైఫల్యాలు భారత్ కు వ్యతిరేకంగా మరో దాడిని జరిపేందుకు మరింతగా ప్రేరేపిస్తాయనడంలో ఎలాంటి ఔచిత్యంలేదని న్యూస్ వీక్ హెచ్చరించింది.


logo