శనివారం 06 జూన్ 2020
International - May 12, 2020 , 13:17:50

వుహాన్ సిటీ జ‌నాభా మొత్తానికి క‌రోనా ప‌రీక్ష‌లు..

వుహాన్ సిటీ జ‌నాభా మొత్తానికి క‌రోనా ప‌రీక్ష‌లు..

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్‌కు చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్ర‌బిందువైన విష‌యం తెలిసిందే. 76 రోజుల లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌ల మ‌ళ్లీ ఆ న‌గ‌రం తెరుచుకున్న‌ది. కానీ గ‌త రెండు రోజుల నుంచి కొత్త పాజిటివ్ కేసులు బ‌య‌ప‌టుడుతున్నాయి. దీంతో న‌గ‌ర అధికారులు ఓ నిర్ణ‌యం తీసుకున్నారు.  వుహాన్ న‌గ‌రంలో ఉన్న కోటి ప‌ది ల‌క్ష‌ల మంది జ‌నాభాకు క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం న‌గ‌రంలోని అన్ని డివిజ‌న్ల‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ప‌ది రోజుల్లో మొత్తం జ‌నాభాకు ప‌రీక్ష చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. రెసిడెన్షియ‌ల్ ప్రాంతాల‌తో పాటు వైర‌స్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రీక్ష‌లు ముమ్మ‌రం చేయాల‌ని భావిస్తున్నారు. వుహాన్‌లో ఏప్రిల్ 8వ తేదీన లాక్‌డౌన్ ఎత్తివేశారు. అయితే మే 10, 11 తేదీల్లో కొత్తగా ఆరు కేసులు న‌మోదు అయ్యాయి.  క్వారెంటైన్‌లో ఉన్న‌వారికి వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డినాయి.  అది కూడా వారంతా ఒకే అపార్ట్‌మెంట్ కావ‌డంతో.. అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నారు. జ‌న‌వ‌రి 23 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు వుహాన్‌లో లాక్‌డౌన్ విధించారు.  

 


logo