గురువారం 28 మే 2020
International - Apr 10, 2020 , 17:39:50

అద్దెల మిన‌హాయింపు కోసం వుహాన్‌లో మోకాళ్ల‌పై నిర‌స‌న‌

అద్దెల మిన‌హాయింపు కోసం వుహాన్‌లో మోకాళ్ల‌పై నిర‌స‌న‌

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 76 రోజులపాటు లాక్‌డౌన్‌లో ఉన్న వుహాన్ ప్ర‌జ‌లు ఇటీవ‌ల లాక్‌డౌన్ ఎత్తేయ‌డంతో త‌మ ప‌నుల్లో బిజీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో వుహాన్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌ల‌లో అద్దెకు దుకాణాలు న‌డుపుకునే చిరు వ్యాపారులు త‌మకు అద్దె మిన‌హాయింప‌లు ఇవ్వాలంటూ నిర‌స‌న‌కు దిగారు. షాపింగ్ కాంప్లెక్సుల ముందు మోకాళ్ల‌పై కూర్చుని త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖాల‌కు మాస్కులు ధరించ‌డంతోపాటు సామాజిక దూరం పాటిస్తూనే త‌మ ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. దాదాపు మూడు నెల‌ల‌పాటు త‌మ వ్యాపారాలు న‌డువక‌ తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని, అందువ‌ల్ల షాపింగ్ కాంప్లెక్సుల య‌జ‌మానులు త‌మ‌కు ఏడాదిపాటు అద్దె మిన‌హాయింపులు ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. 
logo