ఆదివారం 31 మే 2020
International - Apr 08, 2020 , 18:06:42

చైనా: వూహాన్ గట్టెక్కింది కానీ ఉత్తరాదిలో కరోనా సెగ

చైనా: వూహాన్ గట్టెక్కింది కానీ ఉత్తరాదిలో కరోనా సెగ

హైదరాబాద్: వూహాన్‌లో కరోనా సద్దుమణిగిందని సంబురపడుతుండగానే చైనా ఉత్తరాదిలో వైరస్ విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. చైన కరోనా కల్లోలానికి కేంద్ర బిందువులరా నిలిచిన వూహాన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వీధుల్లో తిరుగుతున్నారు. రైళ్లు, బస్సులు తిరుగుతున్నాయి, విమానాలు ఎగురుతున్నాయి. జనాలు షాపింగ్ మాల్స్‌కు వస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా కలుసుకోలేకపోయిన కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్తున్నారు. ఇలా వూహాన్‌లో దృశ్యం సధారణ స్థితికి వస్తున్నట్టు కనిపిస్తున్నది. కానీ చైనాకు సమస్య పూర్తిగా సమసిపోలేదు. ఉత్తరాదిలో, ముఖ్యంగా హైలాంగ్‌జియాంగ్ రాష్ట్రం రష్యా నుంచి సరిహద్దులు దాటివస్తున్న జనాలతో సమస్య ఎదుర్కుంటున్నది. వారి కారణంగానే కరోనా కేసుల సంఖ్య 25 పెరిగింది. దీనివల్ల ఆ సరిహద్దు రాష్ట్రం తీవ్ర వత్తిడికి గురవుతున్నది.


logo