శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 17, 2020 , 18:04:28

విద్యుద్దీపాలతో ముస్తాబైన వుహాన్‌లోని యాంగ్జీ నది..ఫొటోలు

విద్యుద్దీపాలతో ముస్తాబైన వుహాన్‌లోని యాంగ్జీ నది..ఫొటోలు

 వుహాన్‌: కరోనా వైరస్ పుట్టిన వుహాన్ నగరాన్ని దాదాపు మూడు నెలల పాటు పకడ్బందీగా మూసివేసిన విషయం తెలిసిందే. వుహాన్‌.. చైనాలోని హుబే ప్రావిన్స్‌లో కీలకమైన నగరం. చాలా అందంగా ఉంటుంది. నగరాన్ని యాంగ్జీ నది రెండుగా విడదీస్తుంది.  ప్రపంచంలోనే మూడో అతిపెద్ద నది.  ఇది చైనాలో పుట్టి చైనాలోనే సముద్రంలో కలుస్తుంది.  కరోనా కేసులు తగ్గడంతో  ప్రస్తుతం వుహాన్‌ నగరంలోనే కాకుండా, మొత్తం హుబే రాష్ట్రంలో రవాణా ఆంక్షలు చైనా ఎత్తివేసింది. ఎప్పటిలానే ప్రజలు మళ్లీ తిరగడం, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పరిశ్రమలు తెరవడంతో మళ్లీ ప్రజలందరూ బిజీబిజీ అయిపోయారు.

కరోనాపై పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టి దేశం నలుమూలల నుంచి హుబే ప్రావిన్స్‌కు  సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపడంలో భాగంగా యంగ్జీ నదిని విద్యుద్దీపాలతో అలంకరించారు.   నదీ ఒడ్డున ఉన్న ఎత్తైన భవనాలను రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లతో ముస్తాబు చేయడంలో స్థానికులు వాటి ముందు ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.logo