ఆదివారం 31 మే 2020
International - May 01, 2020 , 17:49:23

హుబేలో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ స‌డ‌లింపు

హుబేలో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ స‌డ‌లింపు

కోవిడ్‌-29 వైర‌స్ పుట్టినిల్ల‌యిన చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ప్ర‌భుత్వం ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌ను స‌డ‌లించింది. శ‌నివారం నుంచి స‌డ‌లింపులు అమ‌ల్లోకి రానున్నాయి. అత్యంత తీవ్ర స్థాయి నుంచి తీవ్ర‌స్థాయికి ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌ను త‌గ్గించిన‌ట్లు అధికారులు తెలిపారు. చైనాలో చివ‌రగా ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌ను త‌గ్గించిన ప్రావిన్స్ ఇదే. ఇత‌ర ప్రాంతాల్లో కొద్ది వారాల క్రిత‌మే ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల స్థాయిని త‌గ్గించారు. దేశ రాజ‌ధాని బీజింగ్‌లో ప్ర‌జ‌లు ప్ర‌యాణాలు చేసేందుకు గురువారం నుంచి అనుమ‌తించారు. ఇక్క‌డ ఈ నెల‌లోనే చైనా అత్యున్న‌త వార్షిక పార్ల‌మెంట‌రీ స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. అయితే ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌ను త‌గ్గించిన‌ప్ప‌టికీ విదేశీయుల‌ను దేశంలోకి అనుమ‌తించ‌టంలేదు. ‌


logo