ఆదివారం 31 మే 2020
International - May 06, 2020 , 20:08:45

ప్రపంచవ్యాప్తంగా 37లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 37లక్షలకు చేరువలో కరోనా కేసులు

లండన్‌:  ప్రపంచవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 36,88,635 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ ట్రాకర్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికాలో బాధితుల సంఖ్య 1,205,138కు పెరిగింది. అమెరికాలో కరోనా వల్ల 71,079 మంది చనిపోయారు. యూరప్‌లో అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా బ్రిటన్‌ నిలిచింది. స్పెయిన్‌(219,329 కేసులు), ఇటలీ(213,013), బ్రిటన్‌(196,243), ఫ్రాన్స్‌(170,694), జర్మనీ(167,239), రష్యా(165,929 ) దేశాల్లో అత్యధికంగా కరోనా బాధితులు ఉన్నారు. 


logo