శనివారం 30 మే 2020
International - May 23, 2020 , 06:53:35

ప్రపంచవ్యాప్త కోవిడ్‌-19 మరణాలు 3,39,904

ప్రపంచవ్యాప్త కోవిడ్‌-19 మరణాలు 3,39,904

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్త దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల ఒక వేయి 167 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల 2 వేల 813. వ్యాధి నుంచి కోలుకుని 21 లక్షల 58 వేల 450 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 39 వేల 904 మంది మృత్యువాతపడ్డారు. ఈ వ్యాధి కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. యూఎస్‌ఏలో ఇప్పటివరకు 97,647 మంది చనిపోయారు. కోవిడ్‌-19 కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన వివిధ దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రెజిల్‌-21,048, రష్యా-3,249, స్పెయిన్‌-28,628, యూకే-36,393, ఇటలీ-32,616, ఫ్రాన్స్‌-28,289, జర్మనీ-8,352, టర్కీ-4,276, ఇరాన్‌-7,300, పెరూ-3,244, చైనా-4,634, కెనడా-6,250, మెక్సికో-6,989, బెల్జియం-9,212, పాకిస్థాన్‌-1,067, నెదర్లాండ్స్‌-5,788, ఈక్వెడార్‌-3,056, స్వీడన్‌-3,925, స్విర్జర్లాండ్‌-1,903, పోర్చుగల్‌-1,289, ఐర్లాండ్‌-1,592, ఇండోనేషియా-1,326, రొమేనియాలో 1,166 మంది చనిపోయారు.


logo