ఆదివారం 31 మే 2020
International - May 01, 2020 , 10:47:35

33 లక్షలు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు

33 లక్షలు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి 210 దేశాలకు పైగా విస్తరించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 33 లక్షల 8 వేల 555 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వీటిలో యాక్టిక్‌ కేసుల సంఖ్య 2 లక్షల 31 వేల 490 గా ఉంది. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 లక్షల 34 వేల 112 మంది మృత్యువాత పడ్డారు. వ్యాధి నుంచి 1 లక్షా 42 వేల 953 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అమెరికాలో అత్యధికంగా 63,861 మంది చనిపోగా.. స్పెయిన్‌లో 24,543 మంది, ఇటలీ-27,967, యూకే-26,771, ఫ్రాన్స్‌-24,376, జర్మనీ-6,623, టర్కీ-3,174, రష్యా-1,073, ఇరాన్‌-6,028, బ్రెజిల్‌-6,006, చైనా- 4,633, కెనడా-3,184, బెల్జియం-7,594, నెదర్లాండ్స్‌-4,795, పెరు-1,051, స్విట్జర్లాండ్‌-1,737, స్వీడన్‌-2,586, ఐర్లాండ్‌-1,232, మెక్సికో-1,859 మంది చనిపోయారు. 


logo