బుధవారం 03 జూన్ 2020
International - Apr 25, 2020 , 07:16:05

ప్రపంచంలో విళయతాండవం చేస్తున్న కరోనా

ప్రపంచంలో విళయతాండవం చేస్తున్న కరోనా

పారిస్‌: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య. చైనాలో మొదలైన కరోనా విళయతాండవం క్రమంగా 210 దేశాలకు విస్తరించింది. మొత్తంగా ప్రపంచదేశాల్లో ఇప్పటివరకు 28.27 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌వల్ల 1,96,971 మంది మృతి చెందారు. ఐర్లండ్‌లో నిన్న ఒక్కరోజే 577  కరోనా కేసులు నమోదవగా, 220 మంది మృతిచెందారు. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 9,23,612కు చేరింది. ఇప్పటివరకు 52,092 మంది మృతిచెందారు. ఇటలీలో 1,92,994 కేసులు నమోదవగా, 25,969 మంది మృతిచెందారు. స్పెయిన్‌లో 2,19,764 కేసులు, 22,524 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో 1,59,828 కేసులు నమోదవగా, 22,245 మంది మరణించారు. యూకేలో 1,43,464 కేసులు, 19,506 మంది మృతిచెందారు. బెల్జియంలో 44,293 కేసులు నమోదవగా, 6,679 మంది ఈ వైరస్‌వల్ల ప్రాణాలొదిలారు. జర్మనీలో 1,54,999 కేసులు నమోదవగా, 5760 మంది మరణించారు. టర్కీలో 1,04,912 కేసులు నమోదవగా, 2600 మంది మరణించారు. 


logo