గురువారం 28 మే 2020
International - May 18, 2020 , 09:08:36

ప్రపంచవ్యాప్తంగా 48 లక్షలకు కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 48 లక్షలకు కరోనా కేసులు

న్యూయార్క్‌: ప్రంపచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 48,01,875కి చేరింది. ఇందులో 3,16,671 మంది బాధితులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 18,58,170 మంది కోలుకోగా, 26,27,034  కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కేసులు, మృతుల పరంగా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 15,27,664 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు మొత్తం 90,978 మంది బాధితులు మృతిచెందారు. గడిచిన 24గంటల్లోనే 820 మంది మరణించారు. అమెరికాలో మొత్తం నమోదైన కేసుల్లో ఇంకా 10,90,297 యాక్టివ్‌గా ఉండగా, 3,46,389 మంది కోలుకున్నారు. గత కొన్నిరోజులుగా సగటున పది వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంలో స్పెయిన్‌ను వెనక్కినెట్టిన రష్యా కరోనా కేసుల జాబితాలో రెండో స్థానానికి దూసుకువచ్చింది. దేశంలో ఇప్పటివరకు 2,81,752 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా 2,11,748 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 67,373 మంది బాధితులు కోలుకోగా, 2631 మంది మరణించారు. 

స్పెయిన్‌లో ఇప్పటివరకు 2,77,719 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1,95,945 మంది బాధితులు కోలుకున్నారు. మరో 54,124 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివకు ఈ వైరస్‌బారిన పడిన 27,650 మంది మరణించారు. యూకేలో 2,43,695 కరోనా కేసులు నమోదవగా, 34,636 మంది మరణించారు. దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 2,41,080 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 16,118 మంది మరణించారు. మొత్తం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో  1,30,840 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 94,122 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా కేసుల పరంగా బ్రెజిల్‌ త్వరలో యూకేను వెనక్కి నెట్టే అవకాశం ఉన్నది. 


logo