బుధవారం 08 జూలై 2020
International - Jun 07, 2020 , 08:50:59

70 లక్షలకు చేరువలో ప్రపంచవ్యాప్త కరోనా కేసులు

70 లక్షలకు చేరువలో ప్రపంచవ్యాప్త కరోనా కేసులు

హైదరాబాద్‌ : ప్రపంచవ్యాప్త కరోనా పాజిటివ్‌ కేసులు 70 లక్షలకు చేరువయ్యాయి. 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 69 లక్షల 74 వేల 721 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 31 లక్షల 61 వేల 346గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్‌-19 కారణంగా 4 లక్షల 2 వేల 94 మంది చనిపోయారు. వ్యాధి నుంచి 34 లక్షల 11 వేల 281 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

అగ్రరాజ్యం అమెరికా కరోనా కారణంగా అత్యధిక ప్రభావానికి గురైతుంది. యూఎస్‌ఏలో కొత్తగా 20,900 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 19.88 లక్షలు దాటింది. వ్యాధి కారణంగా అమెరికాలో ఇప్పటివరకు ఒక లక్షా 12 వేల 96 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 మరణాలు అత్యధికంగా సంభవించిన దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రెజిల్‌-36,044, రష్యా-5,725, స్పెయిన్‌-27,135, ఇటలీ-33,846, పెరూ-5,301, జర్మనీ-8,769, ఇరాన్‌-8,209, టర్కీ-4,669, ఫ్రాన్స్‌-29,142, చిలీ-1,541, మెక్సికో-13,511, కెనడా-7,773, పాకిస్థాన్‌-1,935, బెల్జియం-9,580, నెదర్లాండ్స్‌-6,011, స్వీడన్‌-4,656, ఈక్వెడార్‌-3,534, కొలంబియా-1,205, పోర్చుగల్‌-1,474, ఈజిప్ట్‌-1,198, స్విర్జర్లాండ్‌-1,921, ఇండోనేషియా-1,801, పోలాండ్‌-1,153, ఐర్లాండ్‌-1,678, రొమేనియాలో 1,322 మంది వ్యాధి కారణంగా చనిపోయారు.logo