బుధవారం 03 జూన్ 2020
International - May 17, 2020 , 06:39:00

ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 47,17,038

ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 47,17,038

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్త దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని 213 దేశాలు కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 47 లక్షల 17 వేల 38 మంది వ్యక్తులు ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 25 లక్షల 94 వేల 555. కోవిడ్‌-19 కారణంగా 3 లక్షల 12 వేల 384 మంది మృతిచెందారు. వ్యాధి నుంచి కోలుకుని 18 లక్షల 10 వేల 99 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు యూఎస్‌లోలో 89,595 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోయారు. గడిచిన 24 గంటల్లోనే అమెరికాలో 1,237 మరణాలు సంభవించాయి. వివిధ దేశాల్లో అత్యధికంగా నమోదైన కోవిడ్‌-19 మరణాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్పెయిన్‌-27,563, రష్యా-2,537, యూకే-34,466, బ్రెజిల్‌-15,633, ఇటలీ-31,763, ఫ్రాన్స్‌-27,625, జర్మనీ-8,027, టర్కీ-4,096, ఇరాన్‌-6,937, భారత్‌-2,871, పెరూ-2,523, చైనా-4,633, కెనడా-5,679, బెల్జియం-9,005, మెక్సికో-4,767, నెదర్లాండ్స్‌-5,670, ఈక్వెడార్‌-2,688, స్విర్జర్లాండ్‌-1,879, స్వీడన్‌-3,674, పోర్చుగల్‌-1,203, ఐర్లాండ్‌-1,533, ఇండోనేషియా-1,089, రోమేనియాలో 1,094 మంది చనిపోయారు.


logo