గురువారం 02 జూలై 2020
International - Jun 06, 2020 , 09:19:56

ప్రపంచవ్యాప్త కోవిడ్‌-19 మరణాలు 3,98,146

ప్రపంచవ్యాప్త కోవిడ్‌-19 మరణాలు 3,98,146

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 68లక్షల 44వేల 797 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30లక్షల 97వేల 791గా ఉంది. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3లక్షల 98 వేల 146 మంది మరణించారు. వ్యాధి నుంచి 33లక్షల 48వేల 860 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

అగ్రరాజ్య అమెరికా కరోనా మహమ్మారి ప్రభావానికి తీవ్రంగా గురైతుంది. యూఎస్‌ఏలో ఇప్పటివరకు ఒక లక్షా 11వేల 390 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రెజిల్‌-35,047, రష్యా-5,528, స్పెయిన్‌-27,134, యూకే-40,261, ఇటలీ-33,774, పెరూ-5,162, జర్మనీ-8,763, టర్కీ-4,648, ఇరాన్‌-8,134, ఫ్రాన్స్‌-29,111, చిలీ-1,448, మెక్సికో-13,170, కెనడా-7,703, పాకిస్థాన్‌-1,838, చైనా-4,634, బెల్జియం-9,566, నెదర్లాండ్స్‌-6,005, స్వీడన్‌-4,639, ఈక్వెడార్‌-3,534, కొలంబియా-1,145, పోర్చుగల్‌-1,465, ఈజిప్టు-1,166, స్విర్జర్లాండ్‌-1,921, ఇండోనేషియా-1,770, పోలాండ్‌-1,137, ఐర్లాండ్‌-1,670, రొమేనియాలో 1,316 మంది వ్యాధి కారణంగా చనిపోయారు.


logo