e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News Ain Dubai: దుబాయ్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌, ఎత్త‌యిన అబ్జ‌ర్వేష‌న్‌ వీల్‌

Ain Dubai: దుబాయ్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌, ఎత్త‌యిన అబ్జ‌ర్వేష‌న్‌ వీల్‌

దుబాయ్‌: ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని ఎన్నో వింత‌ల‌కు వేదికైన దుబాయ్‌లో ఇప్పుడు టూరిస్టుల‌ను ఆక‌ర్షించే మ‌రో ల్యాండ్‌మార్క్ రానుంది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌, ఎత్త‌యిన అబ్జ‌ర్వేష‌న్ వీల్ సిద్ధ‌మైంది. దీని పేరు ఐన్ దుబాయ్‌( Ain Dubai ). దీనిని అక్టోబ‌ర్ 21న ప్రారంభించ‌నున్న‌ట్లు యూఏఈ ప్ర‌క‌టించింది. లండ‌న్ ఐ ఎత్తు కంటే ఇది రెట్టింపు ఉండ‌టం విశేషం. టూరిస్టుల‌ను గ‌రిష్ఠంగా 250 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ ఇది తీసుకెళ్తుంది. అక్క‌డి నుంచి వాళ్లు దుబాయ్ న‌గ‌ర అందాల‌ను వీక్షించ‌వ‌చ్చ‌ని గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ తెలిపింది. ఈ ఐన్ దుబాయ్ బ్లూవాట‌ర్స్ ఐలాండ్‌లో ఉంది.

ఈ అబ్జ‌ర్వేష‌న్ వీల్‌లో స్కై డైనింగ్‌, ప్ర‌త్యేకంగా కార్పొరేట్ సెల‌బ్రేష‌న్ ప్యాకేజీలు, ఈవెంట్‌లు నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం ఉంది. అంటే బ‌ర్త్‌డేలు, పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్‌లాంటివి ఇందులో చేసుకోవ‌చ్చు. ఈ వీల్ ఒక్క‌సారి చుట్టూ తిర‌గ‌డానికి 38 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. దీనిని ప్రారంభించ‌డానికి యూఏఈ 50వ ఏడాదిలో అడుగుపెడుతున్న సంద‌ర్భాన్ని మించి ఇంకేముంటుంద‌ని దుబాయ్ హోల్డింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీవోవో మ‌హ్మ‌ద్ ష‌ర‌ఫ్ అన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement