శనివారం 16 జనవరి 2021
International - Dec 20, 2020 , 14:49:29

ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌డాగ్ ట్రాలీ ఏదో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌డాగ్ ట్రాలీ ఏదో తెలుసా?

హాట్‌డాగ్.. ఆహారం తీసుకెళ్లేందుకు ఉపయోగించే ట్రాలీ. దీని పరిమాణం ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే, అమెరికాలోని మిస్సౌరీలో నివసిస్తున్న 44 ఏండ్ల చెఫ్ మార్కస్.. ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌డాగ్ ట్రాలీని సృష్టించడం ద్వారా గిన్నిస్ రికార్డులకెక్కాడు. ఈ చెఫ్‌కు హాట్‌డాగ్ మ్యాన్ అని కూడా పిలుస్తారంటే ఆయన క్రేజ్‌ ఎంతో అర్థం చేసుకోవచ్చు. 


గిన్నిస్‌ రికార్డుల ప్రకారం.. ఈ ట్రాలీ వెడల్పు 9 అడుగుల 3 అంగుళాలు. 23 అడుగుల 2 అంగుళాల పొడవు.. 12 అడుగుల 2.75 అంగుళాల ఎత్తు. దీని చక్రాలు 6 అడుగుల 1.5 అంగుళాల వ్యాసంతో ఉన్నాయి. ఇప్పుడు వారు ఈ ట్రాలీతో రోజూ 33 రకాల హాట్‌డాగ్‌లను వినియోగదారులకు అందిస్తూ ప్రత్యేకంగా నిలిచారు. చాలా పెద్ద రొట్టెలు, పెద్ద సాస్ బాటిల్స్, పెద్ద మసాలా దినుసులు..ఇలా అన్ని రకాల వస్తువులను పెద్దవిగా అందులో ఉంచారు. ఈ హాట్‌డాగ్‌ ట్రాలీ రికార్డు ఇంకా పదిలంగానే ఉన్నదంట. దీన్ని బద్దలు కొట్టేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. మార్కస్ ఈ అతిపెద్ద ట్రాలీని పర్మినెంట్‌ రెస్టారెంట్‌గా మార్చేసి  వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటున్నాడు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.