ఆదివారం 31 మే 2020
International - May 05, 2020 , 09:56:03

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా

న్యూయార్క్‌: కరోనా పుట్టిల్లు చైనా ఆ వైరస్‌ కోలుకున్నప్పటికీ, ప్రపంచ దేశాల్లో మాత్రం వైరస్‌ విజృంభిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటివరకు 36,46,099 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 2,52,406 మంది మృతిచెందారు. ఈ వైరస్‌ బారిన పడిన 11,97,708 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 21,95,985 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అమెరికాలో మొత్తం 12,12,900 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 69,921 మంది బాధితులు మరణించారు. 1,88,068 మంది కోలుకోగా, మరో 9,54,887 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. స్పెయిన్లో 2,48,301 కరోనా కేసులు నమోదవగా, 25,428 మంది మృతిచెందారు. ఇటలీలో 2,11,938 కరోనా కేసులు నమోదవగా, 29,079 మంది మరణించారు. యూకేలో 2,11,938 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 28,734 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన 1,69,462 మంది పడగా, 25,201 మంది మృతిచెందారు. రష్యాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,268కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 1,356 మంది మరణించారు.


logo