గురువారం 02 జూలై 2020
International - May 25, 2020 , 08:52:28

213 దేశాల్లో కరోనా.. 55 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు

213 దేశాల్లో కరోనా.. 55 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. చైనాలో పుట్టిన ఈ ప్రమాదకరమైన వైరస్‌ క్రమంగా 213 దేశాలకు వ్యాప్తించింది. వైరస్‌ వల్ల ప్రపంచంలో ఇప్పటివరకు 54,98,580 కరోనా పాజిటివ్‌ కేసులునమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌తో 3,46,688 మంది బాధితులు మృతిచెందారు. వైరస్‌ బారిన పడిన 23,02,004 మంది బాధితులు కోలుకోగా, 28,49,888 మంది చికిత్స పొందుతున్నారు. 

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 18,539 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,86,436కి చేరింది. దేశంలో వైరస్‌ సోకిన వారిలో 99,300 మంది మరణించారు. మరో 11,35,434 యాక్టివ్‌గా ఉన్నాయి. రష్యాను వెనక్కి నెట్టిన బ్రెజిల్‌ రెండో స్థానానికి చేరింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 3,63,618 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 22,716 మంది మరణించారు. 1,49,911 మంది కోలుకోగా, మరో 1,90,991 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న రష్యాలో కరోనా కేసులు 3,44,481కి పెరిగాయి. దేశంలో ఇప్పటివరకు 3541 మంది మరణించారు. 2,82,852 కేసులతో స్పెయిన్‌, 2,59,559 పాజిటివ్‌ కేసులతో యూకే, 2,29,858 కరోనా కేసులతో యూకే, 2,29,858 కేసులతో ఇటలీ, 1,82,584 కేసులతో ఫ్రాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న ఒక్క రోజే భారత్‌లో 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల బాబితాలో ఇరాన్‌ను వెనక్కినెట్టి పదో స్థానానికి చేరింది. భారతదేశంలో ప్రస్తుతం 1,38,536 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


logo