బుధవారం 03 జూన్ 2020
International - May 16, 2020 , 12:14:08

ప్రపంచవ్యాప్తంగా 46.28 లక్షల కరోనా పాజిటివ్‌లు

ప్రపంచవ్యాప్తంగా 46.28 లక్షల కరోనా పాజిటివ్‌లు

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్నది కరోనా వైరస్‌. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 46,28,821 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 3,08,654 మంది బాధితులు మృతిచెందారు. అన్ని దేశాల్లో కలిపి 17,59,702 బాధితులు కోలుకున్నారు. మరో 25,60,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశాల వారీగా చూస్తే.. అమెరికాలో గత 24 గంటల్లో 26,493 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యం మొత్తం 14,84,285 కరోనా కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 88,507 మంది బాధితులు మరణించారు. మరో 10,68,027 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో 2,74,367 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 27,459 మంది మరణించారు. మూడోస్థానానికి దూసుకువచ్చిన రష్యాలో ఇప్పటివరకు 2,62,843 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో 2418 మంది మృతిచెందారు. దేశంలో ఇంకా 2,02,199 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 58,226 మంది కోలుకున్నారు. 

యూకేలో మొత్తం 2,36,711 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా, 33,998 మంది బాధితులు మరణించారు. ఇటలీలో ఇప్పటివరకు 2,23,885 కరోనా కేసులు నమోదవగా, 31,610 మంది మృతిచెందారు. 2,20,291 పాజిటివ్‌ కేసులతో బ్రెజిల్‌ ఆరో స్థానంలో ఉండగా, 1,79,506 కరోనా కేసులతో ఫ్రాన్స్‌ ఏడో స్థానంలో ఉన్నది. ఇక 85940 కేసులతో చైనాను దాటింది. దేశంలో ఇప్పటివరకు 2753 మంది మరణించారు.


logo