ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 08:17:00

24 గంట‌ల్లో 2.2 ల‌క్ష‌ల మందికి క‌రోనా

24 గంట‌ల్లో 2.2 ల‌క్ష‌ల మందికి క‌రోనా

జెనీవా: క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న‌ది. ప‌్ర‌పంచవ్యాప్తంగా కేవ‌లం 24 గంట‌ల్లోనే 2,20,073 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల్లో అత్య‌ధికంగా అమెరికా, బ్రెజిల్‌, భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా దేశాల్లోనే ఉన్నాయి. దీంతో ప్ర‌పంచంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,46,41,819కి చేరింది. ఇందులో 6,08,902 మ‌ర‌ణించ‌గా, 87,35,158 మంది ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందుతున్నారు. మ‌రో 52,97,759 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 


అమెరికాలో నిన్న 65,279 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 38,98,550కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 412 మంది మ‌ర‌ణించ‌డంతో మొత్తం క‌రోనా మృతులు 1,43,289కి చేరారు. బ్రెజిల్‌లో 20,99,896 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, 79,533 మంది చ‌నిపోయారు. ఇక భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 11,18,107 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 27,503 మంది మృతిచెందారు. 

అత్య‌ధిక కేసుల జాబితాలో భార‌త్ మూడో స్థానంలో ఉండ‌గా, రోజువారీ న‌మోద‌వుతున్న కేసుల్లో అమెరికా త‌ర్వాత రెండోస్థానంలో ఉన్న‌ది. మొత్తం మ‌ర‌ణాల్లో భార‌త్ ఎనిమిదో స్థానంలో ఉండ‌గా, రోజువారీ మ‌ర‌ణాల్లో రెండో స్థానానికి చేరింది.


logo