శనివారం 30 మే 2020
International - Apr 27, 2020 , 08:23:42

ప్రపంచంలో 30 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచంలో 30 లక్షలకు చేరువలో కరోనా కేసులు

పారిస్‌: ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ కకావికలం చేస్తున్నది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 29,94,795 చేరింది. ఇప్పటివరకు 2,06,995 మంది బాధితులు మరణించారు. ఈ వైరస్‌ నుంచి 8,78,824 మంది కోలుకోగా, 19,08,975 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 9,87,160 మంది ఈ వైరస్‌ బారినపడగా, 55,413వే మంది మృతిచెందారు. స్పెయిన్‌లో 2,26,629 మందికి కరోనా వైరస్‌ సోకగా, 23,190 మంది మరణించారు. ఇటలీలో కరోనా కేసుల సంఖ్య 1,97,675కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 26,644 మంది మృతిచెందారు. ఫ్రాన్స్‌లో 1,62,100 కరోనా కేసులు నమోదుకాగా, 22,856 మంది చనిపోయారు. జర్మనీలో 1,57,770 మంది కరోనా బారినపడగా, 5,976 మంది కన్నుమూశారు. యూకేలో 1,52,840 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదువగా, 20,732 మంది మృతిచెందారు.


logo