శుక్రవారం 05 జూన్ 2020
International - May 04, 2020 , 15:06:48

క‌రోనా వ్యాక్సిన్ కోసం 830 కోట్ల డాల‌ర్ల నిధి..

క‌రోనా వ్యాక్సిన్ కోసం 830 కోట్ల డాల‌ర్ల నిధి..

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారీ చేసేందుకు యూరోపియ‌న్ దేశాలు ఒక్క‌ట‌య్యాయి. వ్యాక్సిన్ కోసం సుమారు 830 కోట్ల డాల‌ర్ల నిధిని ఏర్పాటు చేసేందుకు ఈయూ దేశాలు అంగీక‌రించాయి. యురోపియ‌న్ క‌మిష‌న్ ప్రెసిడెంట్ ఉరుసులా వాన్ డెర్ లెయిన్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. భారీ నిధి ఏర్పాటుకు ఈయూ దేశాలు ఆన్‌లైన్ ప్లెడ్జింగ్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న‌ట్లు తెలిపారు. అత్యంత క‌ష్ట‌కాలంలో నిధి ఏర్పాటు అవ‌స‌రాన్ని బ్రిన‌ట్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ఆయా దేశాల‌కు తెలియ‌జేయ‌నున్నారు. మూడు రాత్రుల పాటు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న జాన్సన్‌.. ఈ నిధి కోసం 388 మిలియ‌న్ల డాల‌ర్ల మొత్తాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు వాగ్ధానం చేశారు.  వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌, టెస్టింగ్‌, ట్రీట్మెంట్ కోసం నిధుల‌ను ఖ‌ర్చు చేస్తారు. బ్రిట‌న్‌, కెన‌డా, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, జ‌పాన్, నార్వే, సౌదీ అరేబియా, ఈయూ క‌మిష‌న్ దీనిపై స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌నున్నాయి. వ్యాక్సిన్ వ‌స్తేనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనే సంద‌ర్భం ఉన్న‌ట్లు యూఎన్ చెప్పింది. ఇట‌లీ ప్ర‌దాని గుసెప్పొ కాంటే, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మాక్ర‌న్‌, జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ మెర్కల్‌లు ఈ ప్ర‌తిపాద‌న‌కు అంగీక‌రించారు.logo