వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ తమ గుప్పిట్లోకి తీసుకుని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తాలిబాన్‌కు నాయకత్వం వహిస్తున్న ఎమిర్ హెబ్తుల్లా అఖుండ్జాదా ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్ పట్టు సాధించడానికి అగ్రరాజ్యం అమెరికానే ముమ్మాటికి కారణమనే విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన పలు పత్రికలతోపాటు బ్రిటన్ నుంచి వెలువడుతున్న పత్రికలు కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ముప్పేట దాడికి దిగాయి. ఆయన తన సేనలను ఆఫ్ఘాన్ నుంచి విరమించుకోవడం కారణంగానే ఇవాళ అక్కడ ఈ పరిస్థితులు దాపురించాయని జో బైడెన్‌పై నేరుగా ఆరోపణలు గుప్పించాయి.
‘ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు బైడెన్ లొంగిపోవడమే’ అని అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపార దినపత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసింది. ఆఫ్ఘాన్‌లో తాలిబాన్ల పట్ల బైడెన్ అనుసరించిన విధానాన్ని తూర్పార బట్టింది. ‘ఇది బైడెన్ చూడటానికి ఇష్టపడని ఓటమి చిత్రం’ అని అమెరికాకు చెందిన మరో పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికన్ ప్రయోగం ఇబ్బందికరమైన చివరి అధ్యాయంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో రాసింది. ఆధునిక ప్రెసిడెన్షియల్ హిస్టరీలో అధ్యక్షుడి మాటలు జో బైడెన్ మాదిరిగా వేగంగా వెనక్కి తీసుకోబడతాయి. ఆఫ్ఘన్లో ప్రజలను అమెరికా రాయబార కార్యాలయం పైకప్పు నుంచి విమానంలో ఎక్కించలేమని సరిగ్గా 5 వారాల క్రితం జో బైడెన్ చెప్పారు. సరిగ్గా ఇలాంటి సీన్ ఆదివారం నాడు అమెరికా పౌరులు, రాయబార కార్యాలయ ఉద్యోగులను సమీపంలోనే ఉన్న ల్యాండింగ్ ప్యాడ్ నుంచి తీసుకొస్తున్న సమయంలో కనిపించింది.
ఇది ముమ్మాటికీ జో బైడెన్ ఓటమి అని బ్రిటీష్ వార్తాపత్రిక ది గార్డియన్ రాసింది. అదేసమయంలో, తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు ఉపసంహరించుకున్న మరుసటి రోజు నుంచి అల్-ఖైదా పునరుద్ధరించబడితే అమెరికన్ ప్రజలు క్షమించరు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ఒక ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని బిడెన్ చెప్పారు. 2400 మందికి పైగా అమెరికన్లు అక్కడ చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ సైన్యం తిరిగి వచ్చిన తర్వాత తనకు క్రెడిట్ వస్తుందని జో బైడెన్ భావించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని విరమించుకున్న జో బైడెన్‌ను విపక్షాలు ప్రశ్నిస్తాయా? ఇది సరైంది కాదు కానీ, ఇది బైడెన్ ఓటమి. దీనికి అతనే బాధ్యత వహించాలి.
అమెరికాకు చెందిన మరో బిజినెస్ న్యూస్ పేపర్ ఆఫ్ఘనిస్తాన్‌లో జో బైడెన్ లొంగిపోయినట్లు కథనం రాసింది. ఆఫ్ఘన్ సైన్యం తమ దేశాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు యూఎస్ సైన్యం అక్కడే ఉన్నా.. అది మరో సంవత్సరం లేదా ఐదు సంవత్సరాలు ఉంటుందా అనేది ముఖ్యం కాదని బైడెన్ శనివారం చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ఈ పతనానికి అర్హమైనది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగుతున్న తరుణంలో ఒక అగ్రదేశాధినేత చేసిన అటువంటి ప్రకటన చరిత్రలో అత్యంత సిగ్గుచేటు ప్రకటన అని ఆ పత్రిక పేర్కొన్నది.
అదేమాదిరిగా, అమెరికా విశ్వసనీయత ప్రశ్నార్థకం చేశారని అని బీబీసీ, ఆఫ్ఘనిస్తాన్ బైడెన్ కోసం ఓ రాజకీయ విపత్తు అని సీఎన్ఎన్, ఇది ముమ్మాటికీ వైట్‌హౌస్‌పై దాడి అని బెల్జియన్ పత్రిక పొలిటికో, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా విఫలం చెందింది అని జర్మన్ పత్రిక డ్యూయిష్ వెల్లె పత్రిక.. ఇలా ఎన్నో దేశ, విదేశాలకు చెందిన వార్తా పత్రికలు కథనాలు గుమ్మరించాయి.
త్వరలో టాటా, ఐటీసీ సూపర్ యాప్స్..!
జిల్లా వచ్చె.. గడ్డం పాయె ఢాం ఢాం ఢాం..
మేఘాలయలో హింస : హోం మంత్రి రాజీనామా
దేశం విడిచి ఎందుకు వెళ్లిపోయానంటే..? : అష్రఫ్ ఘనీ
ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..