శనివారం 30 మే 2020
International - Apr 05, 2020 , 06:10:37

కరోనా ప్రభావం... ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్‌ మూత

కరోనా ప్రభావం... ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్‌ మూత

హైదరాబాద్ : కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రతాపం చూపుతున్నది. ఈ వైరస్‌ కారణంగా తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ తాత్కాలికంగా మూతపడింది. చిలీలో ఈ టెలిస్కోప్‌ ఉన్నది. సందర్శకుల ద్వారా టెలిస్కోప్‌లో పనిచేసే ఉద్యోగులకు కూడా వైరస్‌ సంక్రమించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దీనిని మూసివేసినట్లు డైరెక్టర్‌ సేన్‌ డౌహెర్టీ తెలిపారు. మే 19 వరకు ఈ కేంద్రాన్ని తెరిచే అవకాశాలు లేవని అంచనావేస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo