ఆదివారం 31 మే 2020
International - May 20, 2020 , 09:45:41

క‌టిక పేద‌రికంలోకి ఆరు కోట్ల మంది..

క‌టిక పేద‌రికంలోకి ఆరు కోట్ల మంది..

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల మంది క‌టిక పేదరికంలోకి వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌పంచ బ్యాంకు హెచ్చ‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది అయిదు శాతం ప‌డిపోనున్న‌ట్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్ అధ్య‌క్షుడు డేవిడ్ మ‌ల్‌పాస్ తెలిపారు. కోవిడ్‌19 వ‌ల్ల ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని, వ్యాపారాలు కూడా దెబ్బ‌తింటున్నాయ‌న్నారు. పేద దేశాల‌కు వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంద‌న్నారు. ల‌క్ష‌లాది మంది జీవ‌నోపాధి నాశ‌న‌మైంద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరోగ్య‌వ్య‌వ‌స్థ కూడా తీవ్ర కుదుపుకు గురైన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ప్ర‌తి రోజు క‌నీసం రెండు డాల‌ర్లు కూడా సంపాదించ‌లేని వారిని వ‌ర‌ల్డ్ బ్యాంక్ క‌టిక పేదలుగా గుర్తిస్తుంది.క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్  పేద దేశాల‌కు సుమారు 160 బిలియ‌న్ డాల‌ర్ల‌ను రుణంగా ఇవ్వ‌నున్న‌ది.  దాదాపు వంద దేశాల‌కు ఇప్ప‌టికే ఎమ‌ర్జెన్సీ ఫైనాన్స్ అందించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్‌తో క‌లిసి వ‌ర‌ల్డ్ బ్యాంక్ కొన్ని దేశాల‌కు రుణం ఇస్తోంది.   


logo