ఆదివారం 29 మార్చి 2020
International - Mar 04, 2020 , 08:56:58

క‌రోనా నియంత్ర‌ణ‌కు.. 12 బిలియ‌న్ల డాల‌ర్లు

క‌రోనా నియంత్ర‌ణ‌కు.. 12 బిలియ‌న్ల డాల‌ర్లు

హైద‌రాబాద్‌:  మ‌హ‌మ్మారిలా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న‌ది. ఆ ప్రాణాంత‌క వైర‌స్‌ను అదుపు చేసేందుకు అన్ని దేశాలు న‌డుం బిగించాయి. క‌రోనాపై పోరాటం చేస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు .. వర‌ల్డ్ బ్యాంక్ సుమారు 12 బిలియ‌న్ల డాల‌ర్లు సాయం అందించేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసింది.  ఎమ‌ర్జెన్సీ ప్యాకేజీ త‌ర‌హాలో వ‌ర‌ల్డ్ బ్యాంక్ ఆయా దేశాల‌కు ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌నున్నారు.  త‌క్కువ వ‌డ్డీతో రుణాలు, గ్రాంట్లు, టెక్నిక‌ల్ స‌హ‌కారం అందించేందుకు కూడా వ‌ర‌ల్డ్ బ్యాంక్ సిద్ద‌మైంది. క‌రోనా వ్యాప్తితో అనేక దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలాయి. ఈ స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కేందుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ భారీ రుణ సాయానికి సిద్ద‌మైంది.  తాము ఇచ్చే నిధుల‌తో అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ప‌బ్లిక్ హెల్త్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయాల‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ పేర్కొన్న‌ది.  అత్యంత‌పేద దేశాల‌ను ఎంపిక చేసి.. నిధుల‌ను చేర‌వేస్తామ‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ చెప్పింది.  


logo