ఆదివారం 07 జూన్ 2020
International - Apr 03, 2020 , 08:36:06

భారత్‌కు 1 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన ప్ర‌పంచ బ్యాంకు

భారత్‌కు 1 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన ప్ర‌పంచ బ్యాంకు

వాషింగ్టన్‌ : కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్‌ పలు దేశాలకు ఆర్థికసాయం ప్రకటించింది. 25 దేశాలకు 1.9 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది. ఈ అత్యవసర ఆర్థికసాయంలో అత్యధికంగా భారత్‌కు 1 బిలియన్‌ డాలర్లను కేటాయిస్తూ గురువారం నాడు జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌గ్యూటివ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్క్రీనింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, లాబోరేరీల ఏర్పాటు, డయాగ్నోస్టిక్స్‌, పీపీఈల కొనుగోలు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు నిధులను వినియోగించనున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోవిడ్‌-19 నిర్మూలనకు గాను ప్రపంచబ్యాంక్‌ నిధులను కేటాయించింది. ఈ క్రమంలో భాగంగా భారత్‌కు 1 బిలియన్‌ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించగా పాకిస్తాన్‌కు 200 మిలియన్‌ డాలర్లు, ఆఫ్గనిస్థాన్‌కు 100 మిలియన్‌ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్‌ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రానున్న 15 నెలల్లో 160 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రపంచబ్యాంక్‌ కసరత్తులు చేస్తుంది. ఈ మొత్తాన్ని దారిద్య్ర నిర్మూలనపై, నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వెచ్చిచ్చనున్నట్లు పేర్కొంది.


logo