శనివారం 30 మే 2020
International - May 13, 2020 , 17:10:34

ట్విట్టర్‌ ఉద్యోగులు ఇక రానక్కర్లే

ట్విట్టర్‌ ఉద్యోగులు ఇక రానక్కర్లే

కరోనా నేపద్యంలో అన్ని దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేసాయి. దీంతో అన్ని ప్రముఖ కంపనీలు కూడా తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చాయి. దీంతో ఉద్యోగులు చాలా మంది ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే ఎప్పటికి అయినా ఆఫీసులకు వెళ్ళాల్సిందే అని అనుకునే ఉద్యోగులకు ట్విట్టర్‌ ఓ మంచి ఆఫర్‌ను ఇచ్చింది. ఇక నుండి తమ ఉద్యోగులు ఆఫీసుకు రానక్కర్లేదు అని ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సే ప్రకటించారు. దీంతో ప్రపంచంలోనే వర్క్‌ ఫ్రం హోంను శాశ్వతంగా ఉపయోగించుకునే అవకాశమిచ్చిన సంస్థగా ట్విట్టర్‌ నిలిచింది. అయితే ఇప్పటికే చాలా కంపనీలు ఈ విషయాన్ని అలోచిస్తున్నాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు కూడా ఈ శాశ్వత ఆఫర్‌ను ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తుంది. 


logo