శనివారం 30 మే 2020
International - May 19, 2020 , 11:42:35

కశ్మీర్‌లో తలదూర్చం.. తాలిబన్ స్పష్టీకరణ

కశ్మీర్‌లో తలదూర్చం.. తాలిబన్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కశ్మీర్ లో తలదూర్చే ఉద్దేశం తమకు లేదని తాలిబన్ వెల్లడించింది. ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం తమ విధానం కాదని స్పష్టం చేసింది. 'కశ్మీర్ జీహాద్‌లో తాలిబన్ చేరిపోతుందనిమీడియాలో వచ్చిన ప్రకటన పూర్తిగా తప్పు. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనేది ఇస్లామిక్ అమిరాత్ స్పష్టమైన విధానం' అని అమిరాత్ ప్రతినిధి సుహేల్ షహీన్ ట్విట్టర్‌లో తెలిపారు. తాలిబన్ల రాజకీయ విభాగంగా అఫ్ఘాన్ ఇస్లామిక్ అమిరాత్ ప్రకటించుకుంది. కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్‌తో స్నేహం అసాధ్యమని, కాబల్ లో అధికారం హస్తగతం చేసుకున్న తరవ్ాత కశ్మీర్ ను కాఫిర్ల నుంచి విముక్తం చేస్తామని తాలిబన్ ప్రతినిధిగా చెప్పుకునే జబీవుల్లా ముజాహిద్ పేరిట వచ్చిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం కలిగించింది. దీనిపై కాబూల్, ఢిల్లీలోని దౌత్యవర్గాలను ఈ ప్రకటన విశ్వసనీయతపై భారత్ తాలిబన్ వర్గాలను సంప్రదించింది. ఆ సంప్రదింపుల ఫలితంగానే అమిరాత్ వివరణ ప్రకటన వెలువడిందని దౌత్యవర్గాలు తెలిపాయి. 


logo