శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 20:30:13

దిల్జిత్ దోసాంజ్ పాట‌కు డ్యాన్స్ చేసిన అమ్మాయిలు.. ఎన్నిసార్లు చూసినా చూడాల‌నిపిస్తుంది!

దిల్జిత్ దోసాంజ్ పాట‌కు డ్యాన్స్ చేసిన అమ్మాయిలు.. ఎన్నిసార్లు చూసినా చూడాల‌నిపిస్తుంది!

అబ్బాయిల డ్యాన్స్ క‌న్నా అమ్మాయిల డ్యాన్స్ చూడ్డానికి ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. గాయ‌కుడు, న‌టుడు దిల్జిత్ దోసాంజ్ కొత్త ఆల్బ‌మ్ జి.ఓ.ఏ.టి. పాటను ఈ ఏడాది జులైలో రిలీజ్ చేశారు. ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆల్బ‌మ్ టైటిల్ ట్రాక్‌కు యూరోపియ‌న్లు నృత్యం చేస్తున్న వైర‌ల్ వీడియో దీనికి సాక్ష్యం. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీస్ అధికారి గుర్లీన్ కౌర్ ఈ క్లిప్‌ను పంచుకున్నారు.

ఒక వ్య‌క్తి భాంగ్రా డ్యాన్స్ చేస్తుంటే అనేక‌మంది మ‌హిళ‌లు అత‌న్ని అనుస‌రిస్తూ ఉన్నారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో భాగ‌స్వామ్యం చేసిన‌ప్ప‌టి నుంచి వీడియోను 23కె మంది వీక్షించారు. ఈ వీడియోను గాయ‌కుడు దిల్జిత్ దోసాంజ్ దృష్టిని కూడా ఆక‌ర్షించింది. అత‌ను దీనికి రీట్వీట్ చేశారు. నెటిజ‌న్లు ఈ క్లిప్‌ను ఇష్ట‌ప‌డుతున్నారు. 

    


logo