కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. వరుసగా నాలుగో రోజు బుధవారం కూడా మహిళలు తమ హక్కులను కాపాడాలంటూ కాబూల్ రోడ్లపైకి వచ్చారు. (Women Demonstration) తమ దేశ అంతర్గత వ్యవహారంలో పాకిస్తాన్ తలదూర్చడాన్ని కూడా వారు నిరసించారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగిన మహిళలపై తాలిబాన్ పోలీసులు విరుచుకుపడి లాఠీలతో కొట్టారు. తుపాకులు ఎక్కుపెట్టి ఆందోళన విరమించేలా ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ వారు వినకుండా ఆందోళన కొనసాగించారు. జనాలను చెదరగొట్టడానికి తాలిబాన్లు మహిళలపై విరుచుకుపడ్డారు. వార్తను కవరేజ్ చేయడానికి వచ్చిన ఓ జర్నలిస్టును వాతలు తేలేలా బెల్టుతో కొట్టారు. రోడ్డు మీదుగా వెళ్తున్న బాలికలను కూడా దారుణంగా కొట్టారు.
ఆందోళనలను కవర్ చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ప్లాట్‌ఫాం ఎటిలాట్ రోజ్‌లోని ముగ్గురు జర్నలిస్టులను తాలిబాన్ అదుపులోకి తీసుకున్నది. ఎటిలట్ రోస్ ప్రకారం, ఎడిటర్ ఖాదీం హుస్సేన్ కరీమి, రిపోర్టర్ అబెర్ షైగాన్, లోట్ఫాలి సుల్తానీలను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కూడా కాబూల్‌లో మహిళల ప్రదర్శనలను కవర్ చేసిన 20 మందికి పైగా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాలా మందిని తీవ్రంగా కొట్టారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ భయంతో వేలాది మంది ఆఫ్ఘన్లు పాకిస్తాన్‌కు పారిపోయారు. అయితే, తమ దేశంలో ఉండనీయకుండా దాదాపు 200 మందిని పాకిస్తాన్ వెనక్కి పంపింది. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పాకిస్తాన్‌కు చెందిన వార్తాపత్రిక డాన్ నివేదించింది. వీరంతా చట్టవిరుద్ధంగా పాకిస్తాన్లోకి ప్రవేశించారని పాకిస్తాన్ అధికారులు వారిని ఆఫ్ఘన్‌కు తిప్పి పంపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్‌కు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మద్దతు తెలిపారు. తాలిబాన్ ప్రతినిధులు ఆఫ్ఘన్లో మంచిగా ప్రభుత్వాన్ని నడుపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లాం సూత్రాలను పాటిస్తుందని, మానవ హక్కులను జాగ్రత్తగా చూసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వారు అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు.
సరిహద్దులో అత్యవసర ల్యాండింగ్‌కు ఎయిర్ స్ట్రిప్
జనవరి నుంచి కొత్తగా ఆన్లైన్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ
యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
జో బైడెన్‌కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
Star Trek : స్టార్ ట్రెక్ సిరీస్‌కు 55 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..