టిబిలిసి: ఒక మహిళ స్విమ్మింగ్ కోసం జంప్ చేయగా ఊహించని ఘటన జరిగింది. ఆమె తలకు ఉన్న విగ్ ఊడటంతో అక్కడున్న వారు నవ్వు ఆపుకోలేకపోయారు. జార్జియాకు చెందిన కొందరు స్నేహితులు ఈత కోసం ఒక స్మిమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. గ్రూప్‌లోని ఒక మహిళ డైవింగ్ బోర్డు పైనుంచి పూల్‌లోకి దూకింది. అయితే ఆమె తలకు ఉన్న విగ్ ఊడి డైవింగ్ బోర్డుపై పడింది. దీనిని చూసి అక్కడున్న వారు తెగ నవ్వుకున్నారు.
కాగా, ‘హోల్డ్ మై బీర్’ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘జుట్టు తడవడం ఆమెకు ఇష్టం లేదు’ అని దీనికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. ‘ఏమి జరుగుతుందో తెలుసుకుని ఆ జుట్టు తనను తాను కాపాడుకుంది’ అని ఒకరు, ‘పూల్‌లోకి దిగేందుకు ఇష్టపడని విగ్’ అని మరొకరు కామెంట్ చేశారు. విగ్ టిప్స్ కోసం మోహన్ లాల్, మమ్ముట్టిని ఆమె అడిగి ఉండాల్సిందని, మిషన్ విజయవంతంగా విఫలమైందంటూ మరికొందరు చమత్కరించారు.