సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Sep 10, 2020 , 11:49:44

దెయ్యాలంటే ఆస‌క్తి ఉండేవాళ్లు ఈ వీడియో చూడండి!

దెయ్యాలంటే ఆస‌క్తి ఉండేవాళ్లు ఈ వీడియో చూడండి!

హ‌ర్ర‌ర్ సినిమాలు ఎక్కువ‌గా చూసేవారికి దెయ్యాలు అంటే బాగా ఆస‌క్తిగా ఉంటుంది. చీకట్లో ఉన్న‌ప్పుడు ఏ చిన్న షాడో చూసినా దెయ్యాలు అని భ్ర‌మ‌ప‌డుతుంటారు. అస‌లు దెయ్యాలే లేవు అని త‌ల్లితండ్రులు కొట్టిప‌డేస్తున్నా పిల్ల‌ల‌కు ఆ అనుమానం మాత్రం పోదు. అంతా నిశ్వ‌బ్దంగా ఉన్న‌ప్పుడు ఏ చిన్న వ‌స్తువు క‌దిలినా కొంత‌మంది దెయ్యం అని భ్ర‌మ‌‌ప‌డుతారు. కానీ దెయ్యాల‌ను మ‌నుషుల క‌న్నా ముందుగా కుక్క‌లే ప‌సిగ‌డుతాయి అంటారు. ఈ వీడియో చూస్తే అది నిజ‌మే అనిపిస్తుంది.

రెండు కుక్క‌ల‌ను ఇంట్లో పెట్టి య‌జ‌మానులు ఎక్క‌డికి వెళ్లారో ఏమో గాని అవి కిటికీ వ‌ద్ద నిల‌బ‌డి బ‌య‌ట ఎవ‌రో క‌నిపించేస‌రికి అరుస్తున్నాయి. ఇంత‌లోనే సోఫా మీద ఉన్న బెడ్‌షీట్ పైకి లేచి కింద ప‌డుతుంది. ఇదంతా వీడియోలో రికార్డైంది. బెడ్ షీట్ క‌దులుతున్న‌ట్లు రెండింట్లోని ఒక కుక్క ప‌సిగ‌ట్టి బెడ్‌షీట్ ద‌గ్గ‌రకు వ‌చ్చి మ‌ళ్లీ అరిచింది. బ‌హుశా అక్క‌డ దెయ్యం ఉండ‌బ‌ట్టే కుక్క అరిచి ఉంటుంది అని వీడియో చూసిన కొంద‌రు అంటున్నారు. మ‌రికొంద‌రేమో ఇదంతా ఎవ‌రో కావాల‌ని కుక్క‌ల్ని భ‌య‌పెట్ట‌డానికి చేస్తున్నారు అని అంటున్నారు. ఈ వీడియో చూసి మీకు ఏమ‌నిపిస్తుందో చెప్పండి. 


logo