గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 27, 2020 , 16:25:20

ఈ యువతికి అరుదైన వ్యాధి.. బయటికొస్తే వృద్ధురాలే!

ఈ యువతికి అరుదైన వ్యాధి.. బయటికొస్తే వృద్ధురాలే!

రబత్ : అరుదైన జన్యు అలెర్జీతో బాధపడుతున్న మొరాకోకు చెందిన 28 ఏళ్ల మహిళ.. సూర్యుడిని చూడక 26 ఏండ్లవుతున్నదంట. సూర్యుడి కిరణాలు ఆమెకు తగలగానే చర్మం పొడిగా మారడం, వృద్ధురాలిగా కనిపించడం జరుగుందంట. అందుకే ఈ యువతి కేవలం రాత్రి సమయాల్లోనే పనులు చక్కబెట్టుకుంటుందంట.

ఫాతిమా ఘజౌయి అనే యువతికి రెండేళ్ల వయసులో అరుదైన చర్మ పరిస్థితి జిరోడెర్మా పిగ్మెంటోసమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. జిరోడెర్మా పిగ్మెంటోసంతో బాధపడేవారు సూర్యుడి కిరణాలకు గురైనప్పుడు వారి చర్మంపై తీవ్రమైన మచ్చలు వస్తాయి. ఫలితంగా రోజంతా నిస్తేజంగా గడపడం.. వృద్ధాప్యం, పొడి చర్మం సంకేతాలను కలిగి ఉంటారు. ఫాతిమా విషయానికొస్తే.. ఆమె పరిస్థితి తీవ్రమైనది. ఆమె రోజు రాత్రి వేళ మొదలవుతుంది. సూర్య రక్షణ లేకుండా 26 సంవత్సరాలుగా పగటిపూట బయటపడలేదని ఆమె పేర్కొన్నది. ఒకవేళ బయటకు రావాలని అనుకుంటే చేతులకు తొడుగులు వేసుకుని, ముఖానికి నాసా మాస్క్ వేసుకుని చర్మం బయటకు కనిపించకుండా కప్పుకోవాలి. నాసా హెల్మెట్ తో పాటు ఎస్పీఎఫ్ 90 సన్ క్రీమ్ కూడా ముఖానికి రాసుకుంటుంది. 

ఆమె చర్మం ఎండకు గురయ్యే ప్రమాదం ఉన్నందున.. ఆమె 13 ఏండ్ల వయస్సులో పాఠశాలకు వెళ్లడం మానేసింది. తాను ఎదుర్కొంటున్న జిరోడెర్మా పిగ్మెంటోసమ్ వ్యాధి గురించి అవగాహన పెంచుకుని దానికి తగినట్లుగా నివారణ చర్యలు తీసుకుంటున్నది. "నేను చాలా అరుదుగా పగటిపూట బయటికి వెళ్తాను. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. సూర్యకిరణాల నుంచి నన్ను రక్షించుకోవడానికి నాసా ముసుగుతో పాటు చేతి తొడుగులు ధరిస్తాను. రోజంతా ఇంట్లోనే గడిపే నాకు.. రోజు రాత్రి పూట మొదలవుతుంది" అని ఫాతిమా చెప్పారు. 


logo