సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 20:43:33

ప్రియుడు పెళ్లి చేసుకోలేద‌ని చెట్టును పెళ్లాడిన మ‌హిళ‌.. పిల్ల‌లు కూడా ఉన్నారు!

ప్రియుడు పెళ్లి చేసుకోలేద‌ని చెట్టును పెళ్లాడిన మ‌హిళ‌.. పిల్ల‌లు కూడా ఉన్నారు!

మ‌హిళ చెట్టును పెళ్లి చేసుకోవ‌డం ఏంటి. సోది అనుకుంటారేమో. నిజ‌మే.. చెట్టును పెళ్లి చేసుకుంటే గొడ‌వ‌లు, విడాకులు అన్న మాటే ఉండ‌దు క‌దా అంటున్న‌ది ఆ మ‌హిళ‌. అంతేకాదు ఈ  చెట్టు త‌మ తండ్రి అని చెప్పుకోవ‌డానికి ఇద్ద‌రు కుమారులు సిగ్గు ప‌డుతున్నారు. ఇదంతా వింటుంటే చాలా క‌న్ఫ్యూజ్‌గా ఉంది క‌దా. వివ‌రాల్లోకి వెళ్తే పూర్తి క్లారిటీ వ‌స్తుంది. మెర్సీసైడ్‌లోని సెఫ్‌టోన్‌లో ద‌గ్గ‌ర్లో ఉన్న రిమ్‌రోజ్ వ్యాలీ కౌంటీ పార్క్ స‌మీపంలో నివ‌సిస్తున్న కేట్ క‌న్నింగ్ హామ్ అనే మ‌హిళకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు క‌డాపుట్టారు. కానీ వివాహం మాత్రం చేసుకోలేదు. ఎప్పుడు పెళ్లిచేసుకోమ‌న్నా నో చెబుతున్నాడు. అందుకే ఆమెకు కోప‌మొచ్చి గ‌తేడాది ఒక చెట్టును పెళ్లి చేసుకున్న‌ది. అంతేకాదు ఇటీవ‌ల‌ వ‌న్ ఇయ‌ర్ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ కూడా జ‌రుపుకున్న‌ది.

దీంతో ఆమె చాలా సంతోషంగా ఉంది. చెట్టును పెళ్లిచేసుకొని దాని బాగోగులు చూసుకుంటూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచింది. కానీ ఆమె పిల్ల‌లు మాత్రం సిగ్గు ప‌డుతున్నారు. చెట్టు మా త్రండి ఏంట‌ని చిరాకు ప‌డుతున్నారు. 'ఎవ‌రు ఏమ‌నుకున్నానేను ప‌ట్టించుకోను. ఈ చెట్టు నాకు చాలా సంతోషాన్నిస్తుంది' అని చెబుతున్న‌ది. అయితే  రిమ్‌రోజ్ వ్యాలీ కౌంటీ పార్క్ మీదుగా బైపాస్ రోడ్డు నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి అక్క‌డున్న స్థానికులు ఒప్పుకోలేదు. దీని మీద ఉధ్య‌మం కూడా న‌డుస్తున్న‌ది. వీరంతా చెట్ల‌ను న‌ర‌కొద్ద‌ని చెబుతుంటే కేట్ ఏకంగా పార్క్‌లో ఉన్న ఓ చెట్టును పెళ్లి చేసుకొన్న విష‌యం తెలియ‌డంతో ఆమెకు అక్క‌డివాళ్లంతా అభిమానులుగా మారిపోయారు. ఆమెను ఆద‌ర్శంగా తీసుకొని ప్ర‌తి ఏటా 'మ్యారీ ఏ ట్రీ డే' అనే కార్య‌క్ర‌మం నిర్వ‌హించాలంటున్నారు. 


logo