గురువారం 28 మే 2020
International - Apr 09, 2020 , 14:24:23

స్టోర్‌లో సరుకులు ఎంగిలి చేసిన మహిళ అరెస్టు

స్టోర్‌లో సరుకులు ఎంగిలి చేసిన మహిళ అరెస్టు

హైదరాబాద్: కాలిఫోర్నియాలోని ఓ సూపర్‌మార్కెట్‌లో జెన్నిఫర్ వాకర్ (53) అనే ఓ మహిళ 1,800 డాలర్ల (మన కరెన్సీలో అయితే సుమారు రూ.లక్షా 30 వేలు) విలువ చేసే సరుకులను కార్టులో వేసుకుని నింపాదిగా ఒకదాని తర్వాత మరొకటి ఎంగిలి చేస్తూ కూర్చున్నది. అందులో మాంసం, మద్యంతో సహా రకరకాల నిత్యావసర సరుకున్నాయి. ఆమె దగ్గర అంత సరుకు కొనేందుకు డబ్బులు కూడా లేవు. అసలే కరోన భయంతో దడుసుకుని చస్తున్న వేళ ఈ వింత ప్రవర్తనతో స్టోర్ సిబ్బంది, అక్కడున్న కొనుగోలుదార్లు ఠారెత్తిపోయారు. ముందుగా జెన్నిఫర్ స్టోర్ లోని ఆభరణాలు మెడలకు, చేతులకు వేసుకుని నాకడం మొదలు పెట్టిందట. తర్వాత కార్టులోని సరుకులను ఒక్కొక్కటి తీసుకుని నాలుకతో రుద్దుతూ పోయింది. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేశారు. తర్వాత ఎంగిలి చేసిన సరుకును ధ్వంసం చేశారు.


logo