శనివారం 23 జనవరి 2021
International - Dec 17, 2020 , 11:50:24

గర్భిణి స్ర్తీ హ‌త్య కేసులో మ‌హిళ‌కు మ‌ర‌ణ‌శిక్ష‌!

గర్భిణి స్ర్తీ హ‌త్య కేసులో మ‌హిళ‌కు మ‌ర‌ణ‌శిక్ష‌!

వాషింగ్ట‌న్ : అమెరికాలో 70 ఏళ్ల త‌ర్వాత ఓ మ‌హిళ‌కు మ‌ర‌ణ శిక్ష అమ‌లు కానుంది. ఎందుకంటే ఆమె ఓ నిండు గ‌ర్భిణిని హ‌త్య చేసినందుకు ఫెడ‌ర‌ల్ కోర్టు మ‌ర‌ణ‌ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 2021, జ‌న‌వ‌రి 12వ తేదీన‌ ఆ మ‌హిళ‌కు విష‌పూరిత ఇంజెక్ష‌న్ ఇచ్చి ఈ శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారు. 

2004, డిసెంబ‌ర్ 16వ తేదీన లిసా మోంట్గోమేరి(49) మిస్సోరిలోని బాబీ జో స్టిన్నెట్‌(23) నివాసానికి వెళ్లింది. కుక్క పిల్ల‌ను కొనుగోలు చేసేందుకు వ‌స్తున్నాన‌ని చెప్పిన లిసా.. స్టిన్నెట్ నివాసానికి వెళ్లిన త‌ర్వాత దారుణానికి పాల్ప‌డింది. 8 నెల‌ల గ‌ర్భ‌వ‌తి అయిన స్టిన్నెట్‌ను తాడును గొంతుకు బిగించి చంపేసింది లిసా. ఆ త‌ర్వాత కిచెన్ క‌త్తితో గ‌ర్భిణి క‌డుపును కోసి బిడ్డ‌ను అప‌హ‌రించింది. గ‌ర్భిణి చ‌నిపోగా, ఆ బిడ్డ బ‌తికింది. 

నేరాన్ని అంగీక‌రించిన లిసా

ఈ కేసులో లిసాను 2007లో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. చేసిన నేరాన్ని లిసా అంగీక‌రించింది. దీంతో ఆమెను జైలుకు త‌ర‌లించారు. ఫెడ‌ర‌ల్ కోర్టు ఆమెకు మ‌ర‌ణ శిక్ష విధించింది. ఈ కేసులో లిసా త‌ర‌పు న్యాయ‌వాదులు ఆమెకు మ‌ర‌ణ శిక్ష ప‌డ‌కుండా ఉండేందుకు గ‌ట్టిగా వాద‌న‌లు వినిపించారు. లిసా మానసిక స్థితి స‌రిగా లేనందునే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింద‌ని లాయ‌ర్లు కోర్టుకు చెప్పారు. కానీ లిసా హీన‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డింద‌ని కోర్టు న్యాయ‌వాదుల‌ను మంద‌లించింది. 

గ‌త వార‌మే లిసాకు మ‌ర‌ణ శిక్ష అమ‌లు కావాల్సి ఉండే.. అయితే ఆమె త‌ర‌పు న్యాయ‌వాదుల‌కు క‌రోనా సోక‌డంతో జ‌న‌వ‌రి 12కు వాయిదా వేశారు. ఇండియానాలోని టెర్రె హ్యుటేలోని ఫెడ‌ర‌ల్ జైల్లో లిసాకు విష‌పూరిత ఇంజెక్ష‌న్ ఇచ్చి శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారు. 

1953లో ఓ మ‌హిళ‌కు మ‌ర‌ణ శిక్ష‌

అమెరికాలో చివ‌రిసారిగా 1953లో ఓ మ‌హిళ‌కు మ‌ర‌ణ శిక్ష అమ‌లు చేశారు. మిస్సోరిలో ఆరేళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసినందుకు గానూ బొన్నై హిడీకి మ‌ర‌ణ‌శిక్ష విధించారు. ఆ త‌ర్వాత ఇప్పుడు లిసాకు ఈ శిక్ష అమ‌లు చేయ‌నున్నారు. 

లిసా గ‌ర్భిణిని ఎందుకు హ‌త్య చేసింది?

లిసా త‌న చిన్న‌త‌నంలోనే త‌ల్లి నుంచి అనే హింస‌ల‌ను ఎదుర్కొంది. పిన తండ్రి చేతిలో అత్యాచారానికి గురైంది. అత‌నితో పాటు ఇత‌రులు కూడా ఆమెపై సామూహిక అత్యాచారాలు చేశారు. దీంతో తీవ్ర మాన‌సిక క్షోభ ఎదుర్కొంది లిసా. చివ‌ర‌కు లిసాను త‌ల్లి వ్య‌భిచార కూపంలోకి దింపింది. దీంతో ఆమెను తీవ్రంగా హింసిస్తూ, దారుణంగా కొట్టేవారు. ఆ ప్ర‌భావం లిసాపై ప‌డ‌టంతో.. మాన‌సికంగా తీవ్ర క్షోభ‌కు గురైంది. ఆ ఉదంతాలే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం తీశాయ‌ని లిసా న్యాయ‌వాదులు పేర్కొన్నారు.  


logo