మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 12:13:12

గాలి కోసం విమానం డోర్ తీసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌హిళ : వీడియో వైర‌ల్

గాలి కోసం విమానం డోర్ తీసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌హిళ :  వీడియో వైర‌ల్

ఇంట్లో గాలి ఆడ‌క‌పోతే బ‌య‌ట‌కు వ‌స్తారు. బ‌స్సులు, రైళ్ల‌లో ప్ర‌యాణం చేసేవారు కిటికీ వ‌ద్ద కూర్చొని వ‌చ్చే గాలిని ఆస్వాదిస్తారు. మ‌రి విమానంలో వెళ్లేవారికి గాలి ఆడ‌క‌పోతే.. వారికి ఆ ప‌రిస్థితే రాదు. లోపల అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తారు. లేదంటే విమానంలో ప్ర‌యాణించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. కానీ ఓ మ‌హిళ‌కు మాత్రం విమానంలో గాలి ఆడ‌డం లేద‌ని ఎమ‌ర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకొని రెక్క‌ల మీద‌కు ఎక్కింది. అప్పుడు విమానం ల్యాండ్ అయింది కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే గాల్లోనే క‌లిసిపోయేది. ఎంత తెలివిత‌క్కువ వాళ్లు కూడా ఈ ప‌ని చేయ‌రు. అందుకే ఈమె మాన‌సిక ప‌రిస్థితి ఎలా ఉంద‌ని వైద్యుల‌కు కూడా చూపించారు. ఆరోగ్యం అంతా స‌వ్యంగానే ఉంది. డ్ర‌గ్స్‌, ఆల్క‌హాలు కూడా ముట్టుకోలేద‌ని తేలింది. మ‌రి ఈమె ఎందుక‌లా చేసింది?

ఆమె హాలిడేస్‌కు ట‌ర్నీలో గ‌డిపింది. త‌ర్వాత బోయింగ్737-86N విమానంలో తిరుగు ప్రయాణమైంది. కైవ్ విమాశ్ర‌యంలో విమానం ఆగింది. త‌న‌తోపాటు ఉన్న ప్ర‌యాణికులు, త‌న పిల్ల‌లు అంద‌రూ విమానం నుంచి కింద‌కు దిగారు. కానీ ఈవిడ ఒక‌టే వెనుకవైపు ఉన్న ఎమ‌ర్జెన్సీ డోర్ ద్వారా విమానం రెక్క‌ల మీద అలా న‌డుస్తున్న‌ది. అది చూసిన పైలెట్ కింద‌కి దిగ‌మ‌ని అరిచాడు. దీంతో ఆమె అదే డోర్ నుంచి లోప‌లికి వెళ్లి కింద‌కు దిగింది. ఎందుక‌లా  చేశావంటే గాలి ఆడ‌క అలా బ‌య‌ట‌కు వ‌చ్చానంటున్న‌ది. ఆరోగ్యం ప‌రంగా ఆమెకు బాన‌నే ఉంద‌ని తెలియ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. ఈ మ‌హిళ‌ను ఓసారి ఈ వీడియోలో చూసేయండి. logo