గురువారం 28 మే 2020
International - Apr 10, 2020 , 14:08:43

ఇన్ స్టా ఓపెన్ చేసి వైన్ తాగాల‌నుకుంది..కానీ..వీడియో

ఇన్ స్టా ఓపెన్ చేసి వైన్ తాగాల‌నుకుంది..కానీ..వీడియో

క‌రోనా మ‌హమ్మారిని త‌రిమికొట్టేందుకు చాలా దేశాల్లో లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో ఇంట్లో ఉన్న కొంత‌మందికి బోరు కొడుతుండ‌టంతో ఏదో ఒక ప్ర‌యోగం చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు ప్ర‌యోగాలు చేయ‌డం క‌న్నా..చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్. నికోలే పార్క‌ర్ అనే మ‌హిళ నెటిజ‌న్ల‌కు ఏం చెప్పాల‌నుకుందో ఏమో కానీ..ఆమె ఓ గ్లాస్ లో వైన్ తీసుకుంది. సోఫాలో పడుకొని ఓ చేత్తో ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసి..మ‌రో చేతితో గ్లాస్ లో ఉన్న వైన్ తాగేందుకు ప్ర‌య‌త్నించింది.

గ్లాస్ చేతిలో నుంచి జార‌డంతో వైన్ కాస్తా ముఖంపై ప‌డ్డ‌ది. ఈ వీడియో నికోలే పార్క‌ర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ‌గా..3 మిలియ‌న్లు వ్యూస్ వ‌చ్చాయి. ల‌క్ష‌కు పైగా కామెంట్ల‌తో 80వేల సార్లు షేర్ చేయ‌బ‌డింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo