మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 21, 2020 , 21:50:52

తాత ఆనందం కోసం ఓ నవవధువు ఏంచేసిందో తెలుసా?

తాత ఆనందం కోసం ఓ నవవధువు ఏంచేసిందో తెలుసా?

లండన్‌: కరోనా మహమ్మారి వృద్ధులపై తీవ్ర ప్రతాపం చూపింది. కొవిడ్‌బారినపడ్డ 40 ఏళ్లలోపువారు త్వరగా కోలుకుంటున్నారు. కానీ, 60పైన వయస్సున్నవారికి ఇది ప్రాణాంతకంగా మారింది. సీనియర్‌ సిటిజన్లు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారని గుర్తించిన వివిధ దేశాలు వారి భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో చాలామంది కేర్‌హోమ్స్‌లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, కరోనా భయంతో కేర్‌హోమ్‌లో ఉంటున్న తాతకు సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఓ నవ వధువు పెళ్లిదుస్తుల్లో వివాహమైన కొద్దిసేపటికే 320 కిలోమీటర్ల ప్రయాణించింది. మనుమరాలిని చూసిన తాత ఆనందంతో కన్నీళ్లుపెట్టుకున్నాడు. 

కరోనా నేపథ్యంలో అలెక్స్ పియర్స్‌ అనే యువతి వివాహాన్ని అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిపించారు. తన 87 ఏళ్ల తాత లేకుండా వివాహం చేసుకోవడం ఆమెకు ఆనందంగా అనిపించలేదు. వెంటనే తన భర్తను తీసుకొని మూడు గంటలు ప్రయాణించి తన తాత ఉన్న హోమ్‌కేర్‌‌ సెంటర్‌కు చేరుకుంది. పెళ్లి దుస్తులలో 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. మనుమరాలిని చూసి తాత గ్రాహంబర్లీ ఆనందభాష్పాలు రాల్చాడు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో రక్షణ తెర వెనుకనుంచి తన మనుమరాలిని చూస్తూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుండగా ఫొటోలో బందించారు.  ఈ ఫొటో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo